సిఎం ఇఫ్తార్‌ విందు

Fri, 3 Sep 2010, IST    vv

హైదరాబాద్‌(వి.వి) : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కె.రోశయ్య ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, మైనార్టీస్‌, వక్ఫ్‌ శాఖ మంత్రి అహ్మదుల్లా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, ఈజిప్టుకు చెందిన ముస్లిం మతపెద్ద మిస్రీ ఖుర్రా, మక్కా మసీద్‌ ఇమామ్‌ అబ్దుల్లా ఖురేషి అజహరి, భారత్‌లో ఇరాన్‌ రాయబారి మహమూద్‌ సఫారి, ముస్లిం ప్రముఖులు షబ్బీర్‌ నక్షబంది, ముఫ్తి సాదిక్‌ మోహినుద్దీన్‌, మౌలానా ఖలీల్‌ అహ్మద్‌, మాజీమంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, వాటిని కొనసాగిస్తామన్నారు. ఆర్థిక వనరుల కొరత వున్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించి తీరుతామని పునరుద్ఘాటించారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు