కెప్టెన్‌ సచిన్‌!

Fri, 3 Sep 2010, IST    vv

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్‌ సచిన్‌గా మారారు. భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్‌) ఆయనకు గ్రూప్‌ కెప్టెన్‌ గౌరవ ర్యాంకును శుక్రవారంనాడు అందజేసింది. దీంతో ఈ లిటిల్‌ మాస్టర్‌ నేటినుండి ఐ.ఎ.ఎఫ్‌ అధికారి అయినట్లే! క్రికెట్‌లో అపూర్వమైన విజయాలు సాధించి, భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినందుకుగాను ఆయనకు ఈ గౌరవర్యాంకుతో వైమానిక దళం సత్కరించింది. ఐ.ఎ.ఎఫ్‌ ర్యాంకు సాధించిన తొలి క్రీడాకారుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. కపిల్‌దేవ్‌కు కూడా ఈ తరహా ర్యాంకు వచ్చినప్పటికీ, ఆయనకు టెర్రిటోరియల్‌ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌కల్నల్‌ ర్యాంక్‌ (2008) దక్కింది. ఎయిర్‌ఫోర్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా సచిన్‌ వ్యవహరిస్తారు. యూనిఫామ్‌ దుస్తుల్లో కన్పించిన సచిన్‌ ఇక్కడి ఎయిర్‌ఫోర్స్‌ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ఐ.ఎ.ఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ పి.వి.నాయక్‌ నుంచి ఈ గౌరవం అందుకున్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు