ఎఐఎస్‌ఎఫ్‌ వజ్రోత్సవాలకు సర్వం సన్నద్ధం

Fri, 3 Sep 2010, IST    vv
తిరుపతిలో నేడు ప్రదర్శన, బహిరంగ సభ

తిరుపతి(వి.వి) : అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌) 75వ వార్షికోత్సవాల సందర్భంగా తిరుపతిలో నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎఐఎస్‌ఎఫ్‌ వజ్రోత్సవాలను విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్త లు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఎఐఎస్‌ఎఫ్‌ వజ్రోత్సవాల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, ఆహ్వాన సంఘం కార్యదర్శి జి.సుబ్రమణ్యం తెలిపారు. పట్టణంలో వాల్‌ రైటింగ్‌, పోస్టర్స్‌, తోరణాలు, వివిధ రూపాలలో ప్రచారం చేశామన్నారు. బహిరంగ సభకు వచ్చే విద్యార్ధులకు ఆర్ట్స్‌కళాశా లలో మంచినీటి సౌకర్యం, ఇందిర మైదానంలో టెంట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతినిధుల సభను గంధమనేని శివయ్య భవన్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌.లెనిన్‌ బాబు, సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షులు

విశ్వనాధ్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి పెంచులయ్య శుక్రవారం స్థానిక గంధ మనేని శివయ్య భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 4వ తేదీన తిరుపతిలో వేలాదిమంది విద్యార్ధులతో ఎస్‌.వి.ఆర్ట్స్‌ కళాశాల నుండి ప్రదర్శన, అనంతరం ఇందిరా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎన్‌.లెనిన్‌బాబు తెలిపారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక విద్యార్ధి సంఘంగా ఎఐఎస్‌ఎఫ్‌ ఖ్యాతిగడించిందని, ఎఐఎస్‌ఎఫ్‌ 75వ వార్షికోత్సవాలు 4,5,6 తేదీల్లో తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4న ప్రదర్శన, బహిరంగ సభ, 5,6 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు 800 మంది విద్యార్ధి ప్రతినిధులతో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షులు సృజన్‌కుమార్‌ అధ్యక్షత వహిస్తారు, ముఖ్య అతిథితులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డా|| కె.నారాయణ, వక్తలుగా ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి అభక్స్‌ టెక్సాల్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి హరినాధ్‌రెడ్డి పాల్గొంటారు. 75వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు, విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ యూనివర్శిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిడి) విధానాలపై చర్చించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని లెనిన్‌బాబు చెప్పారు.

5నే గ్రూప్‌-1 పరీక్షలు : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను ప్రభుత్వం నిర్ణయిం చిన విధంగా 5వ తేదీనే నిర్వహించాలని ఎన్‌.లెనిన్‌బాబు డిమాండ్‌ చేశారు. ఇప్పటికెే లక్షలాది మంది అభ్యర్ధులు వేలాది రూపాయలు చెల్లించి కోచింగ్‌ తీసుకున్నారని, రెండుసార్లు పరీక్ష వాయిదాపడి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెద్ద మనుషులు ఒప్పందం ప్రకారం తెలంగాణా, రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందవలసిన ఉద్యోగాలు భర్తి చేయాలని ఏ ఒక్క ప్రాంతానికి నష్టం జరగకుండా చూడాలని అన్నారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలో రోశయ్య ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు