హైదరాబాద్(వి.వి) : విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని వస్త్రవ్యాపారులు చేపట్టిన బంద్ ఐదవ రోజు కూడా విజయవంతగా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బంద్ ప్రభావం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ వస్త్ర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన 9 రోజులు బంద్‌లో భాగంగా ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 5వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వస్త్ర సంఘాల నాయకులు పాల్గొంటున్నారు. ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లే పెట్టి, తిరిగి పరోక్ష పన్నుల రూపంలో వారి వద్ద నుంచే వసూళ్లు చేసే విధంగా ముఖ్యమంత్రి వ్యవ హరిస్తున్నారని సమాఖ్య నాయకులు విమర్శిం చారు. మానవునికి ఆహారం ఎంతో ముఖ్యమని రూపాయి కిలో బియ్యం పథకం పెట్టిన ముఖ్య మంత్రికి అదే మానవుని మానాన్ని కాపాడే బట్ట కూడా అంతే ముఖ్యమని తెలి యదా? అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకులకు ప్రజలపై ఏ మాత్రం ప్రేమ వున్నా తక్షణమే వ్యాట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష శిబిరాన్ని టిడిపి నేత పి.ఎల్.శ్రీనివాస్, కార్పొరేటర్ శేషు కుమారి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క సందర్శించి, సంఘీభావం తెలిపారు. పి.ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే వస్త్రాలపై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు.
సిఎం వైఖరి విచారకరం
వస్త్రాలపై విధించిన 5 శాతం వ్యాట్‌ను ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ వస్త్ర సంఘాల సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి సోమ దయానంద్ నేతృత్వంలో మల్లేశ్వర్‌రెడ్డి, బచ్చు నర్సింహా రావు, అమ్మనబోలు ప్రకాష్, పి.గోపినాధ్, వి.వేణు గోపాల్, ఎస్.ప్రకాష్ సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి శుక్రవారం చర్చలు జరిపారు. అయితే ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లభించక పోవడంతో వారు అసంతృప్తితో వెనుదిరిగారు. రూ.10 కోట్ల మేర వ్యాపారం చేస్తున్న వారు కూడా పన్ను వద్దంటే ఎలా? రూ.40 లక్షల వరకు కేవలం 1శాతం మాత్రమే పన్ను విధిస్తున్నం కదా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నిం చారని సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని సమాఖ్య నాయకులు ఆరోపించారు. మన రాష్ట్రంలో ఎక్కడ షఉటింగ్, షాటింగ్‌తో పాటు చీరలు దొరకవని, అన్ని ఇతర రాష్ట్రాల నుంచి కొనాల్సిందేనన్నారు. ముందుగా వ్యాట్ కట్టాలంటే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వ్యాట్ అనేది తమ లాభాల్లోనుంచి చెల్లించేది కాదని, ప్రజల నుంచి వసూళ్లు చేయాల్సిందేనన్నారు. దీంతో అధిక వివాహాలు, శుభకార్యాలకు అధిక మొత్తంలో కొనుగోళ్లు చేసేవారు పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నారని తెలిపారు. వ్యాపారం దాదాపు 20 నుంచి 30 శాతం తగ్గి, నష్టాలు వస్తుండడంతో సకాలంలో కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. అంతేకాకుండా నష్టాల మూలంగా చిన్న వ్యాపారులు తమ దుకాణాలను మూసుకోవాల్సి వస్తూ ఉండడంతో కార్మికులు సైతం రోడ్డున పడే అవకాశముందని ఆవేదన వ్యక్తంచేశారు. టర్నోవర్‌తో సంబంధం లేకుండా, లైసెన్స్ ఫీజు తరహా వ్యాట్ స్థానంలో కొంత ఫీజు నిర్ణయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్పారే తప్ప, స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాము వెనుదిరిగి వచ్చినట్లు సోమ దయానంద్ చెప్పారు.
31న చంద్రబాబు దీక్ష
వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు వస్త్ర వ్యాపారులు చేపట్టిన పోరుబాటకు మద్దతుగా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 31న ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆ పార్టీ నేత పి.ఎల్. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ ఇందిరా పార్క్ వద్ద వస్త్ర వ్యాపా రులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని 31వ తేదీన చంద్రబాబు సందర్శించనున్నట్లు చెప్పారు. ఆదేరోజు వస్త్ర వ్యాపారులకు మద్దతుగా చంద్రబాబు ఆ రోజంతా నిరాహార దీక్షలో పాల్గొంటారని శ్రీనివాస్ వెల్లడించారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
