ఇక ఎన్ని'కల' కాలం!

Fri, 27 Jan 2012, IST    vv
మే లోగా 'మున్సి'పోల్స్‌ : సహకారమూ అప్పుడే !

హైదరాబాద్‌(వి.వి) : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కలకు సిద్ధపడుతోంది. రాష్ట్రంలో మే మాసంలో అటు మున్సిపల్‌, ఇటు సహకార ఎన్నికలకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. అందుకు కసరత్తు చేస్తోంది. మే 10వ తేదీలోగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. మే మాసంలో సహకార ఎన్నికలు, పుర పాలక సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సమా యకత్తమవుతోంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో తలమునకలవుతోంది. మేలో మున్సి పల్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి ఎం.మహీధరరెడ్డి, సహకార ఎన్నికలు కూడా జరుపుతున్నట్లు ఆ శాఖమంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి శుక్రవారం వేర్వేరు విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు మే మాసాంతానికల్లా ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి ఎం.మహీధర్‌రెడ్డి వెల్లడించారు. అన్ని మున్సి పాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధంగా వుందన్నారు. జనాభా గణన, రిజర్వేషన్‌ ప్రక్రియ, డివిజన్ల పునర్‌విభజన తదితర కార్యక్రమాలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ముఖ్య మంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి నివేదిక సమర్పి స్తామన్నారు. వీలైనంత త్వరలోనే వీటిని బహిర్గత పరుస్తామని ఆయన వెల్లడించారు. మున్సిపల్‌ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వివరా లను మంత్రి మహీధర్‌రెడ్డి పత్రికల వారికి తెలి పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 125 మున్సిపల్‌ కార్పొ రేషన్లు, మున్సిపాలిటీలు ఉండగా, తాజాగా మరో రెండు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయని, వారం క్రితం ఒంగోలు మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పించామని ఆయన పేర్కొన్నారు. మరో రెండు, మూడు మున్సిపాలిటీలు అతిత్వరలో ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటన్నింటికీ ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్ల కేటాయింపు జరుగుతుందన్నారు. కొత్త మున్సిపాలిటీలకు అవసరమైన సిబ్బంది నియా మకానికి ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. మే లోగా ఎన్నికలు నిర్వహిం చేందుకు అన్నిరకాల ప్రక్రియలు పూర్తిచేయాలని, సంపూర్ణమైన ప్రణాళికలతో సిద్ధంగా వుండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మహీధర్‌రెడ్డి తెలిపారు. పాత మున్సిపాలిటీలలో కొత్తగా చేరిన గ్రామాలకు సంబంధించి బిసి జనాభాగణన కార్యక్రమాన్ని శనివారం నుండే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలి టీలలో నీటి కొరతను నివారించడానికి ప్రణా ళికలు సిద్ధం చేసుకోవాల్సిందిగా కూడా ముఖ్య మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా త్రాగునీటికి రూ.24 కోట్లు మంజూరు చేసినట్లు మున్సిపల్‌ మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలలో రూ.250 కోట్ల మేరకు ఉన్న ''ఫ్రీజింగ్‌ ఎమౌంట్లను'' దశలవారీగా ఎత్తివేస్తామని, ఆయా మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలకు ఈ మొత్తాలను విడుదల చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు. సహకార ఎన్నికలను

మే 10వ తేదీలోగా నిర్ణయించాలని యోచిస్తున్నట్లు సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై ముఖ్య మంత్రితోను, మంత్రివర్గ సమావే శంలోను చర్చించాల్సి వుంటుంద న్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి నెలాఖరు వరకు జరిగే ఈ సమా వేశాల అనం తరం ఇక ఎన్నికల వేడి రాష్ట్రంలో రగలనుంది. బడ్జెట్‌ సమావేశాల తర్వాత సహకార ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాల న్నది ప్రభుత్వ ఆలోచన. వేసవిలో విద్యుత్‌ కోత, నీటి కొరత ప్రభు త్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుం దని, అందువలన అప్పుడు ఎన్ని కలకు వెళితే ఫలి తాలు వ్యతిరేకంగా వస్తాయని పలువురు మం త్రులు, అధికారపక్ష శాసనసభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హించకపోతే నిధులు అందించబోమంటూ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సహకార ఎన్నికలు కూడా నిర్వహిం చాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు