81మంది ఉద్యోగులపై సివిసి కొరడా

Sat, 28 Jan 2012, IST    vv

న్యూఢిల్లీ : అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గానూ దాదాపు 81మంది ప్రభుత్వ అధికారులను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సివిసి) శిక్షించింది. వీరిలో ఎక్కువమంది జాతీయ బ్యాంకుల్లో పనిచేస్తున్నవారే. మొత్తం అధికారుల్లో 36మంది ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవారు. వీరిలో సిండికేట్‌ బ్యాంక్‌కు చెందినవారు 10మంది, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన వారు 9మందిని, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూరుకు చెందిన వారు ఐదుగురు, ఎస్‌బిఐకి చెందినవారు నలుగురు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందినవారు ముగ్గురు వున్నారు. దేనా బ్యాంక్‌కు చెందినవారు ఇద్దరు, అలహాబాద్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పటియాలాకు చెందినవారు ఒక్కొక్కరిని కూడా శిక్షించారు. నవంబరు మాసానికి ఇచ్చిన నివేదికలో సివిసి ఈ వివరాలన్నీ తెలియచేసింది. వీరు కాకుండా, వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు చెందినవారు పదిమంది, భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన వారు 8మంది, రైల్వేకు చెందిన ఎనిమిది అధికారులు, ఢిల్లీ అభివృద్ధి సంస్థ, ఎంసిడికి చెందిన వారు ఒక్కక్కరేసి వున్నారు. సివిసి వారి దగ్గర నుండి రు.1.44కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ నెల రోజుల కాలంలో ప్రభుత్వ విభాగాల పనులను తనిఖీ చేసిన తర్వాత సివిసి ఈ చర్య తీసుకుంది. దాదాపు 1697 ఫిర్యాదులు సివిసికి అందగా, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని అవినీతికి సంబంధించినవే.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు