బడ్జెట్‌ పెంచండి

Sat, 28 Jan 2012, IST    vv
రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినరు మిట్టల్‌

కోల్‌కతా : రైల్వేలకు ఇస్తున్న స్థూల బడ్జెట్‌ మద్దతును పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినరు మిట్టల్‌ శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది రు.20,000 కోట్ల మేర బడ్జెట్‌ సహాయాన్ని అందించినట్లు ఆయన చెప్పారు. ''ప్రస్తుతం 149 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి, కేంద్రం ఇచ్చిన బడ్జెట్‌పై వీటి పురోభివృద్ధి ఆధారపడి ఉన్నది'' అని ఆయన ఇక్కడ విలేకరులకు తెలిపారు. కోల్‌క తాలో జరిగిన రైల్వే బడ్జెట్‌ ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రు.68,000 కోట్ల మేర రవాణా లక్ష్యాన్ని చేరేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. రైల్వేల పునర్నిర్మాణం, ఆదాయ మార్గాలపై పిట్రోడా కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని కాంచరపర వద్ద కోచ్‌ఫ్యాక్టరీ నిర్మాణంలో పాలు పంచుకునే భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నామని మిట్టల్‌ చెప్పారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు