ప్రజా పోరాటాల కోసం నిధుల సేకరణ

Thu, 5 Apr 2012, IST    vv
సిపిఐ నిధుల సేకరణకు నారాయణ శ్రీకారం శ్రీ మూడు గంటల్లోనే రూ.1.87 లక్షల వసూలు

హైదరాబాద్‌(వి.వి) : ప్రజా పోరాటాల కోసం ప్రజల నుండే నిధులు సేకరించి తమ పార్టీ ఖర్చు చేస్తోందని, అందులో భాగంగా ఇంటింటికీి, షాపు షాపుకూ తిరిగి, సిపిఐ కార్యక్రమాలను వివరించి విరాళాలు వసూలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్య దర్శి కె.నారాయణ చెప్పారు. ఎల్‌బి నగర్‌ ఏరి యాలోని భగత్‌సింగ్‌నగర్‌లో నారాయణ, అజీజ్‌ పాషా ఆధ్వర్యంలో జరిగిన సిపిఐ విరాళాల సేక రణ కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ, షాపు షాపుకి తిరిగి విరాళాలు సేకరించారు. సుమారు మూడు గంటల పాటు వీరు ఆ ప్రాంతమంతా కలియదిరిగి రూ.1,87,350 వసూలు చేశారు. కొన్నిచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా నాయకులను తమ ఇంటికి తీసుకెళ్ళి విరాళాలు అందించారు. పొదుపు సంఘాల మహిళలు తమ వంతుగా రూ.5వేలు ఇవ్వడం విశేషం. ఈ నెల 5 నుండి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరాటాల నిర్వహణ కోసం విరాళాలు సేకరించాలన్న సిపిఐ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. సిపిఐ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర సమితి ఆధ్వర్యంలో ఎల్‌.బి.నగర్‌ ప్రాంతం భగత్‌సింగ్‌నగర్‌లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో నారాయణతో పాటు, సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా పాల్గొన్నారు. సిపిఐ కార్యకర్తలతో కలిసి సుమారు 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో పాద యాత్ర చేసి, ఇంటింటికీ తిరిగి విరాళాలు సేక రించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లా డుతూ మద్యం మాఫియా వ్యవహారంపై రాజీ కుదిర్చి, మద్యం సిండికేట్‌ల కేసులు మూసివేయిం చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నదని, అందుకే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఆ విచారణకే తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మద్యం ముడుపుల కేసులను ప్రభు త్వం మూసివేయిస్తే, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభు త్వాన్ని మూసివేయించేలా ప్రజలు తిరగబడ తారని హెచ్చరించారు. మద్యం మాఫియా ముడుపుల వ్యవహారంలో రాజీ కుదిర్చేందుకే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులను రాష్ట్ర కాం గ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ ద్వారా సోనియాగాంధీ ఢిల్లీకిపిలిపించి రాజీ చేయించారని అన్నారు. అందులో భాగం గానే మద్యం సిండికేట్ల ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధిపతి, ఏసిబి అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేశారని అన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిజాయితీగా వ్యవహరించి మద్యం ముడుపుల కేసును సక్రమంగా దర్యాప్తు చేయించాలన్నారు. కేవలం మద్యం సిండికేట్ల వ్యవహారమే కాకుండా, అనధికారికంగా మద్యం తయారీ ఫ్యాక్టరీల నుండి రూ.80 వేల కోట్లు విలువ చేసే మద్యం అక్రమంగా అమ్ముడవుతుందని, దీనిపై కూడా దర్యాప్తు జరగాలని నారాయణ డిమాండ్‌ చేశారు. బూర్జువా పార్టీ తరహాలో మద్యం మాఫియా, ల్యాండ్‌ మాఫియా, మైన్స్‌ మాఫియాలతో రాజీ పడ నందునే సిపిఐ భ్రష్టు పట్టలేదని, సిబిఐ, కోర్టుల చుట్టూ తిరిగే గతి సిపిఐ నాయకులకు పట్టలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఇ.టి. నర్సింహ, సిపిఐ ఎల్‌.బి.నగర్‌ ఏరియా కార్యదర్శి ఆర్‌. గోపాల్‌, సహాయ కార్యదర్శులు పాండురంగాచారి, చందు, కార్యవర్గ సభ్యులు ఎన్‌.దేవయ్య, ఎల్‌.బి.నగర్‌ ఏరియా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి ఎం.ప్రవీణ్‌ కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి దుర్ఘటన పూర్తిగా పోలీసు వైఫల్యమే : నారాయణ

సంగారెడ్డి(వి.వి) : మెదక్‌ జిల్లా కేంద్రమైన సంగా రెడ్డిలో కలెక్టర్‌, ఎస్‌పి.క్యాంపు కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఘోర దుర్ఘటన జరిగితే ఆపలేక పోయారని, ఈ ఘటన పూర్తిగా పోలీసు వైఫల్యమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో గురువారం నారాయణతో పాటు, సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యులు అజీజ్‌పాషాలు పర్యటించారు. దుకాణాలు, వాహనాలు, దహనమైన తీరును పరిశీలించడంతో పాటు వారు బాధితులను పరా మర్శించారు. అనంతరం ఐబి.అతిథి గృహంలో నారా యణ విలేకరులతో మాట్లాడుతూ ఎస్‌పి, కలెక్టర్‌ క్యాంపు కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో విధ్వంసం జరుగుతూ ఉన్నా, పోలీసులు సకాలంలో స్పందించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డిలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపిం చారు. నష్టపోయినవారికి ప్రభుత్వం పరిహారం చెల్లించ టంతో పాటు పునరావసం కల్పించాలని నారాయణ డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ మొత్తం తతంగాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని అన్నారు.అల్లర్లలో ధ్వంసమైన దుకాణాలు, డబ్బాలు, వాహనాలు, పూల దుకాణాలు, బేకరీలను నారాయణ, అజీజ్‌పాషాలు పరిశీలించారు. దగ్థమైన దుకాణాలు, డబ్యాల వద్దకు వెళ్ళి ఎలా జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది తదితర వివరాలను అడిగారు. మీది బజారు, పాత బస్టాండ్‌, నాల్సాబ్‌ గడ్డ ప్రాంతాల్లో పర్య టించారు. అల్లర్ల సందర్భంగా చోటు చేసుకున్న పరిణా మాలను వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అల్లర్లలో పోస్టాఫీసు పక్కన దగ్థమైన డబ్బాలు, గంజ్‌ మైదాన్‌ వద్ద ప్రార్థనాలయాన్ని నారాయణ, అజీజ్‌పాషాలు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, అల్లర్ల సమయంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలను నారా యణకు వివరించారు. నారాయణ పర్యటనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వీర్ల ప్రకాష్‌ రావు, జిల్లా కార్యదర్శి దయానందరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మందా పవన్‌, జిల్లా నాయకులు టిఎం.ఖాలేఖ్‌, శ్రీనివాసరెడ్డి, వజీర్‌బేగ్‌, రాజిరెడ్డి, మన్నె పవన్‌, సురేష్‌, మహిళా సమాఖ్య నాయకురాలు కౌసల్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు