నరసన్నపేట (వి.వి) : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకతానులోని ముక్కలేనని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. శుక్రవారం శ్రీకాకులం జిల్లా వంశధారకాలనీ మైదానంలో ఉప ఎన్నికల బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అధికారదాహం కోసం తాను రాలేదని, సమస్యల పరిష్కారం కోసమే మీముందు కొచ్చానన్నారు. టిడిపి పాలనలో ప్రజలు సుఖంగా జీవించారన్నారు. అబద్ధాల చెప్పి, ప్రజలను నమ్మించి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడి తన కొడుకు జగన్ కోసం లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారన్నారు. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తించాలన్నారు. టిడిపి అధికా రంలోకి వస్తే వస్త్ర వ్యాపారులపై వ్యాట్ రద్దు చేస్తామని, ప్రతినెలా రూ.500ల పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని, రూ.1000ల నిరుద్యోగ భృతి కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర పరువు మంటగలిసేలా కాంగ్రెస్ పార్టీ మాఫియా పాలనను తెరపైకి తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతలుకు 33శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సక్రమ అమలుకు చర్యలు తీసుకుంటామ న్నారు. బిసిలో కళింగవైస్యులను చేర్చే అంశాన్ని మ్యాన్‌ఫెస్టోలో చేర్చుతామన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికొస్తే రాష్ట్ర మంత్రి ధర్మాన వంశధార కార్యాల యాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంగా మార్చివేస్తే, ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ సోషల్‌క్లబ్ స్థలాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యా లయంగా మార్చేశారని దుయ్య బట్టారు. పిసిసి చీఫ్ బొత్స సత్య నారాయణ లిక్కర్ డాన్ అని విమర్శించారు. జగన్ ఓదార్పు యాత్రను అంతులేని యాత్రగా అభివర్ణించారు.
కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీల అవినీతిపై కార్యకర్తలు ఉద్యమంలా తీసుకొని ప్రజలకు వివరించాలని, అపుడే ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. నీతి నిజాయితీకి అద్దం పట్టిన శిమ్మ స్వామిబాబును ప్రజలు ఆశీర్వదించా లని కోరారు. సభలో కింజరాపు ఎర్రన్నాయుడు కూడా మాట్లాడారు. కార్య క్రమంలో మాజీ మంత్రులు కళావెంకటరావు,సీతా రాం,శివాజీ, ప్రతిబాభారతి, ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు గుండ అప్పలసూర్యానారాయణ, అచ్చన్నా యరడు, లక్ష్మణరావు, చౌదరి బాబ్జి పాల్గొన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
