అమూల్య గంగూలీ
ఒక ఒపీనియన్ పోల్ (అభిప్రాయసేకరణ) ప్రకారం ప్రధానమంత్రి పదవికి జరుగు తున్న రేస్‌లో నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీని వెనక్కి నెట్టేసి ముందున్న పరిస్థితుల్లో, ఈ గుజరాత్ ముఖ్యమంత్రి ఇప్పటివరకు, ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనబడకుండా పోవడం విచిత్రంగా వుంది. ఎన్నికల కమిషన్ బాక్సులలో బేలట్‌లు సీలు చేయకముందు పంజాబ్, ఉత్తరా ఖండ్‌లలో ఆయన ముఖం కనబడలేదు. ఉత్తర ప్రదేశ్‌లోనైనా ఆయన జాడ కనబడుతుందా అన్నది ఎవరైనా ఊహించుకోవచ్చు.
దీనికి పూర్తి భిన్నంగా యువనాయకుడు రాహుల్ ఉత్తర ప్రదేశ్‌లో అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు చూస్తుంటే విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలన్నట్లుగా వుంది. పార్టీ గనుక 2009 పనితీరునే తిరిగి ప్రదర్శించగలిగితే-అప్పుడు ఎవరూ ఊహించ నివిధంగా, అక్కడ ఒక్కసీటైనా గెలిచే పరిస్థితిలేదని అందరూ భావిస్తున్న తరుణంలో ఏకంగా 33 పార్ల మెంటు సీట్లు గెలుచుకొన్నట్లుగా-అతని రాజ కీయ గమనంలో ఒక మహత్తరమైన భవిష్యత్ ఎదురుచూస్తోందని అనుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ కూడా 2014 ఎన్నికలను ధీమాగా ఎదుర్కోవచ్చు.
కాంగ్రెస్ గనుక అంచనాలనందుకోలేకపోయిన పరిస్థితుల్లో ఏం జరుగుతుందన్నది పరిశీలించ బోయే ముందు మరో ప్రధానమంత్రి ఆశావహు నివైపు తిరిగి చూద్దాం. గత సెప్టెంబరులో సామా జిక సమరస భావనకోసం చేపట్టిన సద్భావన ప్రదర్శన సందర్భంగా వ్యవహరించి నట్లు, ఇప్పుడు తన గురించి బాకాలూదుకునేందుకు మోడీ ఒంటరిగా లేరు. ఈ మధ్యనే నితిన్ గడ్కారీ ఆయన కనుకూలంగా మాట్లాడారు. మోడీ సుముఖత వ్యక్తం చేయని సంజరు జోషిని బిజెపి అధ్యక్షులు కాషాయదళంలోకి చేర్చుకున్ననాటి నుండి వీరి మధ్య స్నేహం అంతంత మాత్రంగానే వుంది. ఇప్పుడు ఆయన జాతీయరంగంపై మరింత పెద్దపాత్ర పోషించేందుకు దోహదపడే విధంగా ఆయన ప్రతిష్ఠ పెంచేందుకు ఈ మహ త్తర కృషి ప్రారంభమైందన్నది సుస్పష్టం. దుర దృష్టవశాత్తు, ముఖ్యమంత్రి మోడీ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా జరుపుతున్న రాజకీయ పోరాటం ఓటమి దిశలో సాగుతున్నట్లు అర్థమౌతోంది. మాజీ కాంగ్రెస్ ఎంపి ఎహ్సాన్ జాఫ్రి వితంతు భార్య, మోడీకి వ్యతిరేకంగా ఫైల్ చేసిన కేసు అహమ్మదాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు పెండింగ్‌లో వుంది. మొదటి సద్భావన యాత్రకు ముందు ఉపశమనం పొందిన పరిస్థితి యిప్పుడు కనబడటంలేదు. 2002 నుండి గుజరాత్‌లో జరిగిన అన్ని బూటకపు ఎన్‌కౌంటర్ కేసులపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయంతో, ఇప్పుడున్న పరిస్థితి ముఖ్యమంత్రికి చాలా యిబ్బందికరంగా మారింది. ఎలాగైతే 2000పై చిలుకు మత అల్లర్ల కేసులను తిరిగి తెరవాలని ఆదేశిస్తూ వాటిని గుజరాత్ వెలుపలకు బదిలీ చేయాలనే ఆదేశం, నేరస్థులను శిక్షించడంలో, మోడీ ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టో తాజా న్యాయస్థాన ఆదేశం, అటువంటి ప్రతికూల సందేశాన్నే అతని ముందుంచింది.
మోడీ యిబ్బందులు చట్టపరమైనవి. అయితే, రాహుల్ యిబ్బందులు రాజకీయపరమైనవి. ఆయనకున్న ప్రత్యామ్నాయాలు సైతం పరిమి తమైనవి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పునరు జ్జీవనం కల్పించడంలో 2009లో సాధించిన విజయం తరువాత, ఆ విన్యాసాన్నే తిరిగి ప్రద ర్శించే ఆశాభావంగా అతను బీహార్‌వైపు తిరిగాడు. అయితే నితీష్‌కుమార్ ముందు బొక్కబోర్లాపడ్డాడు. నితీష్ ప్రజాకర్షణశక్తి ఇంకా తగ్గుముఖం పట్ట లేదు. రాహుల్ తనశక్తిసామర్ధ్యాలను ప్రదర్శించేం దుకు మరో రాష్ట్రం లేకపోవడంతో, అతని రాజకీయాలకు, ప్రజాకర్షణకు ఉత్తరప్రదేశ్ ఏకైక పరీక్షాకేంద్రంగా మారింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలన్నీ ఒక ప్పుడు కాంగ్రెస్ గొప్పగా వెలిగి యిప్పుడు మసక బారి వున్న రాష్ట్రాలే. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ యిప్పటికీ, ఢిల్లీకి చేరుకునే రోడ్డుగా భావించబడుతోంది. విజయమైనా, వైఫల్యమైనా, మరెక్కడా లేనంత విలువ యిక్కడ వుంది. నెహ్రూ, గాంధీ కుటుంబంతో ఈ రాష్ట్రానికున్న సాన్ని హిత్యంతో రాష్ట్ర ప్రాముఖ్యత మరింత పెరిగింది. 2009లో అనేకమంది మీడియా ప్రతినిధులు పేర్కొన్నట్లుగా ఈ కుటుంబం పట్ల ప్రత్యేక గౌరవం ఇంకా మిగిలే వుంది. ఈ మనోభావా లను వినియోగించుకునేందుకు రాహుల్ సరిగ్గా సరిపోయారు. ఆయన రూపం, ఆయన అణకువ, చిత్తశుద్ధితో కూడిన వైఖరి, ఒక వక్తగా ఆయన వాగ్ధాటి దానికుపయోగపడుతోంది. కాంగ్రెస్‌కు ఉన్న పేరుకు, ప్రియాంకగాంధీ వధేరా ఉనికి మరింతగా తోడ్పడుతుందన్న దాంట్లో అనుమానం లేదు. తన వారసునిగా రాహుల్‌కు ప్రాధాన్య తనిస్తూ సోనియాగాంధీ తన మనోభావాన్ని వెల్లడించకముందు ప్రియాంకాగాంధీయే ముం దుంటుందని అందరూ ఊహించారు. ఇప్పటికీ, జనాన్ని ఆకర్షించగలిగే శక్తి ప్రతీ బహిరంగ సభలోనూ కనబడుతుంది. ఈ సోదరీ సోదరుల ద్వయాన్ని గెలుపు జంటగా ఎవరైనా చెబితే కాదనలేని పరిస్థితి వుంటుంది. అయితే రాజకీ యాలకు వాస్తవంగా దూరంగా ఉంటూ వచ్చిన ఆమె యిప్పుడు బయటికి వచ్చి తన సోదరునితో పాటు కలిసి ప్రచారం చేపట్టిందంటేనే యుపి ఎన్నికలను కాంగ్రెస్ ఎంత తీవ్రంగా తీసు కుంటోందో అర్ధమౌతుంది. దాని అనుకూలతలు, ప్రతికూలతలు సుస్పష్టం. మొదటి జాబితాలో బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీల పట్ల ప్రజలలో భ్రమలు తొలగిపోయాయి. బిఎస్ పికి సంబం ధించి, దాని ఇటీవలి వైఫల్యాలు, అభి వృద్ధి లేకపో వడం, ఆరోగ్య కుంభకోణం మొద|| వున్నాయి. సమాజ్‌వాది పార్టీకి సంబంధించి సంఘవ్యతిరేక శక్తులతో దాని సాన్నిహిత్యంతో సహా దాని పూర్వపు అప్రతిష్ట. అందువల్ల ఆ రెండింటిలో ఏ ఒక్కటి తమ తమ కీలకమద్దతు గ్రూపులకు మించి తన ఓటు పునాదిని విస్తరించు కోలేవు. బిఎస్‌పికి సంబంధించి జాతవ్‌లు లేదా చమర్‌లు, సమాజ్‌వాది పార్టీకి సంబంధించి యాదవ్‌లు- తప్ప ఆ పార్టీలు తమ ఓట్ల పునాదిని విస్తరించు కోగలిగే అవకాశాలు లేవు. ఇకపోతే కాంగ్రెస్ అన్ని విభాగాల నుండి మద్దతుదారులను ఆకర్షించగలదు. వారిని చేరుకోగలిగే నిర్మాణ వ్యవస్థ కొరవడడమే దానికున్న ప్రతికూలత.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
