విశాఖపట్నం (వి.వి) : అసంఘటిత రంగ కార్మికలు కోరికలు నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 7న నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం గాజువాక బాలచెరువు వద్ద ఐఎన్‌టియుసి అధ్యక్షులు గోవింద వెంకటరావు అధ్యక్షతన గేటుమీటింగ్ నిర్వహించారు. ఈ సభలో ఎఐటియుసి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు వివి రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న పార్లమెంటు సభ్యుల జీతాలు పెంచిన ప్రభుత్వం కార్మికుల వేతనాల విషయంలో అన్యాయం చేస్తుందని అన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నర్శింగరావు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఈ సభలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, ఎన్.రామారావు, బొడ్డు పైడిరాజు, సిహెచ్ సన్యాసిరావు, రాములు నాయుడు, ఐఎన్‌టియుసి నాయకులు మంత్రి రాజశేఖర్, యలమంచిలి అప్పారావు, ఎ.శ్రీనివాసరావు, మోహన్ కుమార్, రెడ్డిపల్లి నానాజీ, పులిగురప్ప, తాతారావు, పాల్గొన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
