సచివాలయ ముట్టడికి ఎబివిపి విఫలయత్నం

Fri, 3 Sep 2010, IST    vvv

హైదరాబాద్‌ (వి.వి) : ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 1 పరీక్షలను వాయిదా వేయాలని, దామాషా ప్రకారం తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించిన అనంతరమే పరీక్షను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఎబివిపి కార్యకర్తలు సచివాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సచివాలయానికి నాలుగు వైపుల నుండి ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకు వచ్చారు. ఎన్టీఆర్‌ ఘాట్‌వైపున అరెస్టు చేస్తున్న తరుణంలోనే మింట్‌ కాంపౌండ్‌వైపు నుండి, తెలుగుతల్లి విగ్రహం వైపునుండి, లుంబినీ పార్కు వైపు నుండి పరుగుపరుగున సచివాలయ ప్రధాన గేట్‌ వద్దకు కార్యకర్తలు దూసుకువచ్చారు. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగారు. కార్య కర్తలకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సచివాలయంలోనికి వెళ్ళాల్సిన మంత్రులు గాదె వెంకట్‌రెడ్డి, పార్థసారథి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖేష్‌గౌడ్‌లతోపాటు వివిధ శాఖలకు చెందిన కార్య దర్శుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఎక్కడికక్కడే నిలబడిపోయాయి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు