వాటా కోరడం సమంజసం కాదు

Fri, 3 Sep 2010, IST    vv
శైలహైదరాబాద్‌ (వివి) : తెలంగాణ అంశాన్ని గ్రూప్‌-1 పరీక్షలకు ముడిపెట్టడం, 42 శాతం వాటా కోరడం సమంజసం కాదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులజానాథ్‌, శివరామిరెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌ (వివి) : తెలంగాణ అంశాన్ని గ్రూప్‌-1 పరీక్షలకు ముడిపెట్టడం, 42 శాతం వాటా కోరడం సమంజసం కాదని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీసర్‌ డా||సాకే శైలజానాధ్‌, నాయకులు వై.శివ రామిరెడ్డి అన్నారు. గ్రూప్‌-1 పరీక్ష ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిందని, పరీక్షకు సన్నద్ధమ వుతున్న విద్యార్ధుల ఆర్థిక వనరులు, వారి వయోపరిమితి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను యధావిధిగా నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తాము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని వారు చెప్పారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాల్సిన రాజకీయ పెద్దలు భావోద్వే గాలతో ఉన్న విద్యార్ధులను తమ స్వార్ధప్ర యోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిశితంగా విమర్శించారు. గతంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షలో తెలంగాణ అభ్యర్ధులు వాటా కంటే అధిక పోస్టులు సాధించుకున్నారని డా|| శైలజా నాధ్‌ అన్నారు. అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగావకాశాలు దక్కాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఆధారాలుంటే చర్యలు తప్పవు

ఎపిపిఎస్‌సి ఛైర్మన్‌ వెంకటరామిరెడ్డిపై వచ్చిన అవకత వకలకు సంబంధించి ఆధారాలుంటే ప్రభుత్వం తప్ప కుండా చర్యలు తీసుకుంటుందని డా|| శైలజానాధ్‌ చెప్పారు. వెంకటరామిరెడ్డిపై ఆరోపణలొచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదని, అలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చాలామంది ఉన్నారని వై.శివరామిరెడ్డి అన్నారు. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే ప్రభుత్వం కమిటీ వేయడం సహజమేనని, హత్య చేసిన నిందితుల జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి హంతకుడు కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ వాటా కోరుతున్న నేపధ్యంలో జిల్లాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, జిల్లాల వారీగా వాటాలను నిర్ణయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు