లక్షలాది మంది రంజాన్‌ ప్రార్థనలు

Fri, 3 Sep 2010, IST    vv

హైదరాబాద్‌ (వి.వి.) : పవిత్ర రంజాన్‌ మాసం ఆఖరి శుక్రవారం(అల్విదా జుమ్మా) సందర్భంగా పాతబస్తీ మక్కా మసీద్‌ వద్ద లక్షలాది మంది ముస్లీం సోదరులు ప్రార్థనలు చేశారు. మక్కామసీద్‌, జామామసీద్‌, చౌకీమసీద్‌లు పరిసరాలు నిండిపోయాయి. గుల్జార్‌ హౌజ్‌ నుండి శాలి బండా వరకు రోడ్డుపైనే నమాజ్‌కు ఏర్పాట్లు జరిగాయి. నేటి ఉదయం 9 గంటల నుండే ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు విధించారు. ప్రార్థనలు కొనసాగే వరకు ఇది కొనసాగింది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మెటల్‌ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ప్రత్యేకంగా ఎత్తైన టవర్లను ఏర్పాటు చేసి సిసి కెమెరాలను అమర్చారు. బైనాక్యులర్స్‌తో పోలీసుల నిఘా కొనసాగింది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు