మీ బాధ్యత పెరిగింది

Fri, 3 Sep 2010, IST    vv
కార్యకర్తలకు సోనియా ఉద్బోధ
అధ్యక్షురాలిగా నాల్గవసారి బాధ్యతల స్వీకారం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ శుక్రవారం నాల్గవ విడత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్‌ ప్రతిష్టను ఎప్పుడూ ఉన్నతంగానే ఉంచుతానని ఈ సందర్భంగా ఆమె వాగ్ధానం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తల బాధ్యత మరింత పెరిగిందని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని ఆమె ఉద్బోధించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి అంటే దేశం పట్ల పెద్ద బాధ్యతగల పదవి అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురా లిగా ఎన్నికైనట్లు ధృవీకరిస్తూ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథార్టీ ఇన్‌చార్జ్‌ ఆస్కార్‌ ఫెర్నాం డజ్‌ ఆమెకు ధృవీకరణ పత్రాన్ని అందచే శారు. పార్టీ గందరగోళ పరిస్ధితిలో ఉన్న సమయంలో ఒంటిచేత్తో పార్టీని సంకీర్ణ మార్గంలో రెండుసార్లు విజయం సాధిం చేలా ముందుకు తీసుకువెళ్ళానని ఆమె చెప్పారు. సీతారామ్‌ కేసరి నుండి 1998 ఏప్రిల్‌లో ఆమె పార్టీ పగ్గాలను చేపట్టారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మం త్రులు, ఎఐసిసి కార్యకర్తలు పలువురు ఈ సందర్భంగా సోనియాను అభినం దించారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మాత్రం ఈ అంశానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. విదేశీ వనితగా అనేక అవరోధాలను సోని యా ఎదుర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, దేశంలోని అన్ని ప్రాం తాలవారి ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ఎప్పుడూ ఉన్నతస్థానంలోనే ఉంటుందని ఆమె అన్నారు. ''మేం పదవిలో ఉన్నా లేకపోయినా ఎల్ల ప్పుడూ మేము మా బాధ్యతను గుర్తెరిగే ఉంటాం.'' అని ఆమె అన్నారు. సోని యా విజయం పట్ల ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆనందోత్సాహాలలో మునిగి తేలారు. రాజీవ్‌గాంధీ భార్యగా రాజకీయ రంగంలోకి అడుగిడిన సోనియా ఇప్పటి వరకూ మూడు సార్లు ఏకగ్రీవంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడిది నాల్గవసారి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు