సుప్రీంకోర్టు హద్దులపై సి.పి.ఐ వ్యాఖ్య

Fri, 3 Sep 2010, IST    vv

న్యూఢిల్లీ : గోదాముల్లో ఆహార ధాన్యాలను కుళ్ళబెట్టడానికి బదులుగా పేదలకు, అన్నార్తులకు తక్కువ ధరకు లేదా ఉచి తంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాల్సిందిగా భారత ప్రభు త్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా వుందని సిపిఐ పేర్కొంది. అయితే అదే సమయంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి కొన్ని తీవ్ర సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయని సిపిఐ కేంద్ర కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్లమెం ట్‌, కార్యనిర్వాహక వర్గం అధికారాలను సుప్రీం కోర్టు లాక్కుంటు న్నదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపింది. ఈ విషయంలో, ప్రభుత్వ విధానమేమిటన్నది ప్రభుత్వమే నిర్ణయించా ల్సివుంది. న్యాయవ్యవస్థ ఇలా ప్రభుత్వ అధికారాలను లాక్కోవడా న్ని అనుమతిస్తే ప్రజాస్వామ్యంలో అధికారాల విభజన అన్న ప్రాధమిక సూత్రం దెబ్బతింటుందని పేర్కొంది. అందువల్లే సుప్రీం కోర్టు ఒక హద్దు ఏర్పరచిందని, దానికి మించి తాము కూడా వ్యవహరించబోమని తెలిపింది. ప్రభుత్వ విధానాల్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిన సందర్భాలు కూడా వున్నాయని సిపిఐ పేర్కొంది. కాని ప్రస్తుత విషయంలో, సుప్రీం కోర్టు ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్‌, ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకుంది. సూత్రప్రాయంగా చూసినట్లైతే, సుప్రీం కోర్టు వైఖరిని మనం సమర్ధించలేం. అయితే ఇక్కడ ప్రస్తుత తీర్పు ప్రజలకు అనుకూలంగా వున్నది కనుక తప్పదు. అయితే ఈ వైఖరిని ఇలాగే అనుమతిస్తే ప్రతిసారీ చెప్పేది ప్రజానుకూలంగానే వుంటుందన్న గ్యారంటీ లేదు. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతం. పార్లమెంట్‌ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీగా వుండాలి. అందువల్ల విధానాలకు సంబంధించి దిద్దుబాటు చర్యలనేవి పార్లమెంట్‌ నుండి రావాలి. ప్రభుత్వం ప్రజల ముందు తల వంచాలి. ఆహార విధానానికి సంబంధించి మన వైఖరి స్పష్టంగానే చెప్పాం. ప్రజా పంపిణీ వ్యవస్థ వల్ల దెబ్బతింటున్న ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర కార్యదర్శివర్గం విమర్శించింది. ప్రభుత్వం అవాస్తవికంగా, తనకిష్టం వచ్చినట్లుగా దారిద్య్ర రేఖకు ఎగువున(ఎపిఎల్‌), దారిద్య్ర రేఖకు దిగువున(బిపిఎల్‌) అని విభజించింది. ఈ విధానం ఆహార భద్రతను ప్రమాదంలో పడేసింది. ఆహార పదార్ధాల కొరత ఎదుర్కొనే కేరళ వంటి రాష్ట్రాల హక్కులను నిరంకుశంగా, బాధ్యతారాహిత్యంగా నిరాకరి స్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వం తాను చేసిన హామీలనే నెరవేర్చ లేకపోతోందన్న మాట. ఆహార భద్రతా చట్టం తీసుకువస్తామని యుపిఎ ఇచ్చిన హామీ కలగానే మిగిలిపోయింది. సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం హామీ కల్పించాలి. అప్పుడు ప్రజల కనీస అవసరాలు దాని ద్వారా తీరతాయి. ఆహార భద్రత కోసం బహిరంగ మార్కెట్‌పై ఆధారపడే విధానం చాలా ప్రమాదకరం. ఎన్‌డిఎ సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం అక్రమ నిల్వదారులకు, బ్లాక్‌ మార్కెటీర్లకు మాత్రమే ఉపయోగపడుతోంది. దీన్ని ఇంతవరకు యుపిఎ సవరించలేదని ఆ ప్రకటన పేర్కొంది. ఆహార భద్రత సాధించే లక్ష్యంతో రైతులకు చవకగా వ్యవసాయ ఉపకరణాలు అందచేయడం, మరింత మెరుగైన గోదాముల సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్న స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ సిఫార్సులను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ పేర్కొంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు