చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ అశ్విన్ రామ్‌కుమార్‌తో శుక్రవారం ఇక్కడ రాణి మెయ్యమ్మారు హాల్‌లో అతి వైభవంగా జరిగింది. ఈ వివాహానికి చిత్ర రంగ ప్రము ఖులతో పాటు రాజకీయ నేతలు కూడా పలువురు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తెల్లని పుష్పాల వరుసలతో, బంగారు రంగు వర్ణంతో సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ కళ్యాణ మండపాన్ని అలంకరించారు. ఉదయం 7.30గంటలకే కల్యాణమండపం కిటకిటలా డింది. ఆహుతుల్లో ప్రముఖ దర్శకులు, రాజకీయవేత్తలు, నటీనటులు, ఇతర ప్రముఖులు వున్నారు. తెల్లని చొక్కా, ధోవతి ధరించిన రజనీకాంత్ తమిళ బ్రాహ్మణ సాంప్ర దాయ పద్ధతిలో వివాహ క్రతువును నిర్వహించారు. వేదపండితులు నాలుగు వేదాల్లో శ్లోకాలు చదువుతూ వథూవరులకు ఆశీర్వచనాలు పలికారు.
తొలుత ఆకు పచ్చని పట్టుచీరలో, సాంప్ర దాయ ఆభరణాలు ధరించి తయారైవచ్చిన సౌందర్య వివాహ సమయానికి 9గజాల ఎర్ర చీరని ధరించారు. రజనీకాంత్ దంపతులు స్వయంగా అతిధులను సాదరంగా ఆహ్వానించారు. బాలచందర్, మణిరత్నం, సుహాసిని, రచయిత వైరముత్తు, మాజీ మంత్రి ఆర్.ఎం.వీరప్పన్, గాయని సుశీల, నటులు శివకుమార్, ప్రభు ప్రభృతులు హాజరయ్యారు. తర్వాత ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైకో, కేంద్ర హోం మంత్రి చిదంబరం కూడా కుటుం బాలతో విచ్చేశారు. నాదస్వరం మోగు తుండగా అశ్విని, సౌందర్య మెడలో తాళి కడుతుండగా ఆమె తల్లి లత చాలా ఉద్విగభరితంగా కనిపించారు. కాగా తమిళనాడు, కర్నాటక సాంప్రదాయ రుచులతో సహా పలు రకాల్లో దాదాపు 3వేల మందికి అల్పాహారం సిద్ధం చేశామని, 5వేల మందికి భోజనాలు సిద్ధం చేసినట్లు కేటరర్ అరుసువై కుమార్ తెలిపారు. గురువారం లాంఛనంగా నిశ్చితార్ధం అయింది. అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చారు. వచ్చిన అతిథుల్లో ఐశ్వర్యా రారు బచ్చన్, అభిషేక్ బచ్చన్, శ్రీదేవి, మంత్రి అళగిరి వున్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
