నిషిద్ధ మందులపై ఎఐవైఎఫ్‌ పోరు

Fri, 3 Sep 2010, IST    vv

హైదరాబాద్‌(వి.వి.): దేశంలో,రాష్ట్రంలో నకిలీ, నాసిరకం, నిషేధిత మందులు బహిరంగ మార్కెట్‌ ను కుదిపేస్తున్నాయని విచ్చలవిడిగా నిషేధిత మందులు చెలామణి అవుతుంటే అరికట్టవలసిన డ్రగ్స్‌ కంట్రోల్‌ అథారిటి అధికారులు ఫార్మా కంపెనీల, మల్టీనేషనల్‌ కంపెనీలకు అమ్ముడు పోతూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారని రాష్ట్ర ఏఐవైఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య డ్రగ్స్‌ కంట్రోల్‌ వైఫల్యంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు నేడు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ సమితి ఆధ్వర్యంలో యస్‌.ఆర్‌.నగర్‌లోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అథారిటి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 5 నుండి సెప్టెంబర్‌ 15 వరకు అన్ని జిల్లాల్లో నకిలీ, నాసిరకం, నిషేధిత మందులను నివారించాలని, తయారుచేస్తున్న ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దుచేయాలని, ఏజెన్సీలపై దాడులు నిర్వహించాలని నిషేధిత మందుల లిస్ట్‌ను ప్రతి మెడికల్‌ షాప్‌ వద్ద ప్రదర్శించాలని, ఉత్పత్తి రేట్ల కంటే 400 శాతం 500 శాతం అధిక రేట్లకు అమ్ముతున్న మందుల షాపులు, కంపెనీలపై చీటింగ్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ నగర కార్యదర్శి బి.రాములు యాదవ్‌ మాట్లాడుతూ మనుషుల ప్రాణాలను హరించే మందులను నిషేధించినా వాటిని నియంత్రించకపోవడం దారుణమన్నారు. నగర అధ్యక్షులు కె.నరసింహ్మారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు ప్రకటనలు చేయడమేకాక తక్షణం రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై దాడులు చేయాలని, ఇప్పటివరకు ఎన్ని ఫార్మా కంపెనీలపై దాడులు చేశారో, ఎన్నింటిని మూతవేశారో ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్‌ నగర ఉపాధ్యక్షులు రాకేష్‌సింగ్‌ జి.హరి నాథ్‌గౌడ్‌, కుమార్‌యాదవ్‌, అబీబ్‌, కాశీంరాజు, వాసు, శివకుమార్‌, లక్ష్మణ్‌ తది తరులు పాల్గొన్నారు.

ఆర్‌.పి.మీనాకు విజ్ఞప్తి

నకిలీ, నిషేధిత, నాసిరకం మందు లను నియంత్రించాలని, వాటిపై దాడులు చేయాలని, ఫార్మా కం పెనీల లీలలు బయటపెట్టాలని కోరుతూ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో వివిధ దేశాలలో వాడ కాన్ని నిషేధించినా, నకిలీ బోగస్‌, బ్రాండెడ్స్‌ మందులు అధికధరలు, ఆయా కంపెనీల వివరాలతో కూడిన 14 పేజీల విజ్ఞాపన పత్రా న్ని డైరెక్టర్‌ జనరల్‌ డ్రగ్స్‌ ఆర్‌.పి.మీనాకు జి.ఈశ్వరయ్య, రాములు యాదవ్‌, నరసింహారెడ్డి, కుమార్‌ యాదవ్‌ తదితరులు ఇచ్చారు. ఈసందర్భంగా ఏఐవై ఎఫ్‌ను ఆయన అభినందించారు. నకిలీ మందులు అమ్ముతున్న దుకాణాలపై దాడులు చేస్తామని, స్టాఫ్‌ను భర్తీ చేస్తామని, బోగస్‌ కంపెనీలను మూతవేస్తామని, కేసులు పెడతామని హామీ ఇచ్చారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు