ఆధార్‌ కార్డులపై సమసిన వివాదం

Fri, 27 Jan 2012, IST    vv

న్యూఢిల్లీ : దేశంలో నివసిస్తున్న ప్రజలందరికి చిప్‌ ఆధారిత స్మార్ట్‌ కార్డులను జారీ చేయడంపై ప్రణాళికా సంఘానికి, హోం మంత్రిత్వ శాఖకు మధ్య కొనసాగుతున్న వివాదానికి శుక్రవారం తెర పడింది. దాదాపు పదహారు రాష్ట్రాల్లోని అదనపు 40 కోట్ల ప్రజలకు స్మార్ట్‌ కార్డులు ఇవ్వాలన్న యుఐడిఎఐ ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వివాదం సమసిపోయింది. అదే విధంగా ఎన్‌ఆర్‌పి ప్రాజెక్టు క్రింద ఇతర రాష్ట్రా ల్లోని బయోమెట్రిక్స్‌ను సేకరిస్తామని తెలిపింది. కాగా యుఐడిఎఐ కోసం అదనపు రు.5,791.74 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. హోం మంత్రిత్వ శాఖ లేవనెత్తిన భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరిస్తామని యుఐడిఎఐకి నేతృ త్వం వహిస్తున్నామని నందన్‌ నిలేకని తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఈ మొత్తం ప్రక్రియను రెండు సంస్థలు పూర్తి చేస్తాయని ఆయన చెప్పారు. ''మరో ఎనిమిది వారాల్లో భద్రతా ఆందోళనలను సమీక్షిస్తాం. ఏప్రిల్‌ నుండి డాటా సేకరణను ప్రారంభిస్తాం'' అని నిలేకని ఇక్కడ విలేకరులతో అన్నారు. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా(యుఐడిఎఐ)పై ఏర్పడిన కేబినెట్‌ కమిటీ తన ప్రతిపాదనలను ఆమోదించిన తరువాత నందన్‌ నిలేకని ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాగా కార్డుల జారీలో ప్రణాళికా సంఘంతో ఎటువంటి విభేదాలు లేవని హోం శాఖ మంత్రి పి. చిదంబరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. యుఐడిఎఐ డాటా, ఎన్‌పిఆర్‌ డాటాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఇందులో ఎన్‌పిఆర్‌ విజయం సాధించిందని ఆయన తెలిపారు. ''యుఐడిఎఐ జారీ చేస్తున్న ఆధార కార్డులు స్వచ్ఛందమైనవని, ఎన్‌పిఆర్‌ తప్పనిసరి, ఇది ప్రభుత్వ కార్యక్రమం' అని చిదంబరం చెప్పారు. మోసపూరిత డాటాను నివారిస్తాం.

అదేవిధంగా ఆధార్‌ కార్డు కోసం తమ వివరాలను, బయోమెట్రిని ఇచ్చిన వారు ఎన్‌పిఆర్‌ కోసం మరోమారు బయోమెట్రి ఇవ్వాల్సిన అసరం లేదని చిదంబరం తెలిపారు. ఎన్‌పిఆర్‌ జారీ చేసే చిప్‌ ఆధారిత జాతీయ గుర్తింపు కార్డు ఒక వ్యక్తికి సంబంధించిన 15 వివరాలు ఇందులో ఇమిడి ఉంటాయని ఆయన తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు