వెనక్కి తగ్గం

Fri, 27 Jan 2012, IST    vv
వ్యాట్‌పై తేల్చిచెప్పిన సిఎం

హైదరాబాద్‌(వి.వి) : వస్త్రాలపై వ్యాట్‌ విష యంలో అన్ని రాష్ట్రాల్లో వున్న విధానాన్నే మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నామని, రూ.5 లక్షల టర్నోవర్‌ కలిగిన వ్యాపారంపై ఎటువంటి పన్ను విధించడం లేదని, రూ.40 లక్షల వరకు కేవలం 1 శాతం మాత్రమే పన్ను విధిస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే రూ.40 లక్షల రూపా యల వ్యాపార టర్నోవర్‌ దాటితేనే వ్యాట్‌ వసూలు చేస్తామని, రూ.10కోట్ల వ్యాపారం చేస్తున్న వ్యాపా రిపై కూడా పన్ను విధించవద్దని ఆందోళన చేయ డం సమంజసం కాదని ముఖ్యమంత్రి అన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధులు కొందరు శుక్రవారం ఉదయం క్యాంప్‌ కార్యాల యంలో ముఖ్యమంత్రిని కలుసుకున్న సందర్భంగా వారినుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ పన్ను వసూళ్ళ విషయంలో ఎవరినీ వేధించడం లేదా ఇబ్బందులు పెట్టడం జరగకూడదని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా మన్నారు. పవర్‌మిల్స్‌, హ్యాండ్‌లూమ్‌, జరీ వస్త్రాలపై ఎటువంటి పన్ను విధించడం లేదన్న విషయం అందరికీ తెలుసన్నారు. వస్త్ర వ్యాపారులకు సంబంధించి ఇతరత్రా సమస్యలేమైనా వుంటే పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోగలమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు