రాహుల్‌ వ్యాఖ్యలే పెద్ద సర్టిఫికెట్‌

Sat, 28 Jan 2012, IST    vv
ముఖ్యమంత్రి కిరణ్‌

హైదరాబాద్‌(వి.వి) : దేశంలో ఏ రాష్ట్రంలో నూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం అమలు చేస్తు న్నామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని, ఉత్తరప్రదేశ్‌ను ఆంధ్ర ప్రదేశ్‌ మాదిరిగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లతో మారు స్తామని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ చెప్పడం కంటే మన రాష్ట్రానికి పెద్ద సర్టిఫికెట్‌ అవసరం లేదని అన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చి నందుకు, రచ్చబండ కార్యక్రమం సందర్భంగా ముఖ్య మంత్రి ఇచ్చిన పలు హామీలు, సిసి రోడ్లు, ఎలక్ట్రిక్‌ సబ్‌స్టేషన్‌, మంచినీటి పథకాలు వంటివి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసినందుకు గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయ కులు శుక్రవారం ఉదయం ఇక్కడి క్యాంపు కార్యాల యానికి చేరుకొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారినుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదల కోసం దాదాపు 7.5 కోట్ల జనాభా, 2.26 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే కిలో రూపాయి బియ్యం పథకం, రైతులకు లక్ష రూపాయల వరకూ వడ్డీ లేని పంట రుణాలు, మహిళలకు 5 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు, ఒక్కో పథకానికి వెయ్యేసి కోట్ల రూపాయల వంతున సబ్సిడీ చెల్లించే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కేవలం ఒక్క అభివృద్ధి వల్లనే ఓట్లు రావని, చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకూ వుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల వల్ల మేలు జరగని కుటుంబం రాష్ట్రంలో లేదని, చివరకు తన కుటుంబం కూడా గ్యాస్‌ సిలెండర్‌పై రూ.25లు రాయితీ పొందుతు న్నదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటని, మెదక్‌ జిల్లాలోని 10 సీట్లకు ప్రస్తుతం వున్న 8 సీట్లకు తోడు మిగిలిన 2 సీట్లను ఎలాగైనా కాంగ్రెస్సే గెలుచుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గజ్వేల్‌ గ్రామ పంచాయితీని మున్సి పాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసినందుకు గజ్వేల్‌ శాసనసభ్యులు నరసారెడ్డి, పఠాన్‌చెరువు శాసనసభ్యులు నందీశ్వర్‌గౌడ్‌ ప్రభృతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు