హైదరాబాద్ (వివి) : రైతు పోరుబాట తరహాలో త్వరలో బిసి పోరుబాట నిర్వహించనున్నట్లు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించారు. స్వాత త్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా బిసిల్లో పేదరికం తగ్గలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో బిసి సాధికార సదస్సు జరిగింది. 120 కులాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ బిసిలకు జాతీయ స్థాయిలో కమిషన్‌ను నియ మించామని డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌లో 25శాతం వాటాను కేటాయించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరళీ కృత ఆర్థిక విధానాల ఫలితంగా సంపద పెరిగిందే తప్ప సక్రమ పంపి ణీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంపదలో బిసిలకు సమ వాటా దక్కేంత వరకు టిడిపి పోరాడు తుందని ఆయన స్పష్టం చేశారు. బిసిల వేదికను నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చాలామార్లు ప్రయ త్నించి విఫలమైందన్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని పార్టీలు కూడా రైతుపోరుబాటను ధ్వంసం చేసేం దుకు ప్రయత్నించి విఫలమయ్యా యని ఆయన పేర్కొన్నారు. టిడిపిని ఇబ్బంది పెట్టే పార్టీలను ఆయన హెచ్చరించారు. టిడిపిని నాశనం చేసేందుకు ప్రయత్నించే పార్టీలే భూస్థాపితమవుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలో బిసి కులాలు పెరిగాయే తప్ప పేదరికం తగ్గలేద న్నారు. బిసిల రిజర్వేషన్లు ఏమాత్రం తగ్గకుండా మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. రెడ్డి సుబ్రమణ్యం బిసి విభాగం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు టి.దేవేందర్‌గౌడ్ నాయకత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. కమిటీ ఒక నివేదికను రూపొందించి, కార్యాచరణను ప్రకటించనుంది.
అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం
శాసనసభ ఆవరణలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు స్పీకర్‌కు అందజేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనేది తేటతెల్లమవుతుందని ఆయన ఈ సందర్భంగా విలేకరులతో అన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
