హైదరాబాద్ (వివి) : రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే అంశమై జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అధ్యక్షులు, సహకార మార్కెటింగ్ సొసైటీల అధ్యక్షులతో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం విస్తృతంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పిసిసి అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనా రాయణ, ప్రాథమిక విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఎస్.శైలజా నాథ్, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్‌కాబ్) అధ్యక్షులు విజయే ందర్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పేదల కోసం ముఖ్యంగా రైతుల కోసం పలు సంక్షేమ కార్య క్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, వీటిలో వడ్డీ లేని పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ హెచ్చింపు మొదలై నవి ఉన్నాయని, ఆప్‌కాబ్ అధ్యక్షులు పలువురు డిసిసిబి, డిసి ఎమ్మెస్ అధ్యక్షులు చెబుతూ సహకార సంఘాల ఎన్ని కలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధమేనని ముఖ్య మంత్రికి వివరించారు. విద్యుత్ సరఫరా విషయంలో కొంత సమస్య ఏర్పడినప్పటికీ, ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి మెరుగు పడిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యవసా యానికి ఏడు గంటలు సరఫరా విషయంలో సమస్య లేదని, ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 242 మిలియన్ యూనిట్లు వుండగా, 235 మిలియన్ యూనిట్లు సరఫరా చేయడం జరిగిందన్నారు. గత వేసవిలో రాష్ట్రంలో ఎటు వంటి విద్యుత్ కొరత ఏర్పడలేదని అదే మాదిరి వచ్చే వేస విలో కూడా ఎటువంటి విద్యుత్ కొరత ఉండబోదని ఆయన హామీనిచ్చారు. ఈ వేసవిని ఎదుర్కోవడానికి నెలలో 1,000 మెగావాట్లు, మరొక నెలలో 900 మెగావాట్లు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయనున్నామని వివరించారు.
40లక్షల ఓటర్లు :రాష్ట్రంలోని సహకార సంఘాలకు 40లక్షల ఓటర్లు ఉన్నారని సరాసరి ఒక్కో ప్రాథమిక సహకార సంఘానికి 1400 మంది ఓటర్ల వంతున ఉంటారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతులకు ఇప్పటికే ఏటా 10వేల కోట్ల సబ్సిడీ ఎరువులపై ఇస్తున్నామన్నారు. పంట రుణాలపై పావలా వడ్డీ చెల్లింపు గడువు గతంలో ఎనిమిది నెలలు మాత్రమే వుండేదని, ప్రస్తుతం పూర్తిగా వడ్డీలేని రుణాలను ఏడాది గడువుకు పెంచామని, రబీ నుంచి రబీకి లేదా ఖరీఫ్ నుంచి ఖరీఫ్‌కి లక్ష రూపాయల వరకు రైతు రుణం తీసుకుని ఎటువంటి వడ్డీ లేకుండా సకాలంలో చెల్లించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
