హైదరాబాద్(వి.వి) : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎపిట్రాన్స్‌కో త్వరలోనే ఈ స్థితి నుంచి గట్టెక్కెే అవకాశాలున్నాయి. బాండ్ల రూపంలో రూ.4000 కోట్లు సేకరించాలని ట్రాన్స్‌కో నిర్ణయిం చింది. అందుకు బాండ్లను జారీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే సింగరేణి బొగ్గు గనుల సంస్థకు, ఎపి జెన్‌కోకు కోట్ల రూపా యల మేరకు ట్రాన్స్‌కో బకాయి పడింది. ఈ బకాయిలు తీర్చడానికి సరిపడ ఆదాయం లేకపోవటంతో తీవ్ర ఆర్థిక సంక్షో భాన్ని ఎదుర్కొం టుంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌కోకు చెల్లిం చాల్సిన విద్యుత్ సబ్సిడీ వ్యయాన్ని కూడా చెల్లించటం లేదు. దానికి బదులుగా బాండ్లను జారీ చేయ డానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. బాండ్ల ద్వారా సేకరించే నిధులను బకాయిలు తీర్చడంతో పాటు కొత్త ప్రాజెక్టుల కోసం ఉపయోగ పడగలవని అధికా రులు భావిస్తు న్నారు. వాస్తవానికి ఇంధనం సర్‌చార్జీ వ్యయం సర్దు బాటు ద్వారా వినియోగదారుల నుంచి కనీసం రూ.3వేల కోట్ల వరకు సేకరించాలని ట్రాన్స్‌కో యోచించింది. అయితే సర్ చార్జీ వసూళ్ళపై హైకోర్టు వ్యతి రేకి స్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఆ ఆలో చనను విరమిం చుకుంది. ఏదిఏ మైనా గుజరాత్ తర్వాతనే ఇం తటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ రెండ వ స్థానంలో ట్రాన్స్‌కో నిలిచింది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
