ఎర్రచందనం పట్టివేత

Thu, 5 Apr 2012, IST    vv
ఎగువతంభళ్లపల్లెలో పోలీసుల మెరుపు దాడులు
రూ.3కోట్ల విలువచేసే దుంగలు స్వాధీనం
అదుపులో ఒకరు, పరారీలో మరో ముగ్గురు స్మగ్లర్లు

కలసపాడు (వివి) : కడప జిల్లా కలసపాడు మండల పరిధిలోని ఎగువతంభళ్లపల్లె గ్రామంలో బుధవారం రాత్రి 8గంటల నుండి అర్థరాత్రి ఒంటిగంట వరకు పోరుమామిళ్ల సిఐ మురళీ నాయక్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మూడు కోట్ల రూపాయల విలువచేసే 550 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ తెలిపిన మేరకు దిగువతంభళ్లపల్లె గ్రామానికి చెందిన నాగశేషు నివాసంలో ఎర్రచందన దుంగలు ఉన్నట్లు అందిన సమాచారంతో ఆ ఇంటిపై దాడులు నిర్వ హించగా, కొన్ని దుంగలు దొరికాయన్నారు. అదే విధంగా నాగశేషు ఇంటికి ఎదురుగా ఉన్న గంగసాని రామిరెడ్డి వామిదొడ్డిలో కూడా మరికొన్ని దుంగలను స్వాధీనం చేసుకుకున్నట్లు చెప్పారు. ఎగువ రామాపురం, ఎగువతంభళ్లపల్లె గ్రామాల పరిధిలో నల్లమల అడవులు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుండి ఎర్రచందన అక్రమ రవాణా జరుగుతూనేవుంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పట్టుబడ్డ ఎర్రచందన దుంగలను ఇతర ప్రాంతాలకు తరలిం చేందుకు ఒక చోట నిల్వ చేశారు. విషయాన్ని తెల్సుకున్న పోరుమామిళ్ల సిఐ మురళీనాయక్‌, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు ఎస్‌ఐలు రాజారెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌కుమార్‌తో పాటు దాదాపు 50 మంది సిబ్బంది బుధవారం రాత్రి 8గంటల నుండి 12 గంటల వరకు సోదాలు నిర్వహించగా ఈ దుంగలు పట్టుబడ్డాయి. ఎర్ర చందనాన్ని పట్టుకోవడంతోపాటు స్మగ్లర్‌ నాగశేషును అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ దుంగలను వాహనాలతో పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే గురువారం ఉదయం ఎఎస్పీ రాజేంద్ర, డీఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లు పోరుమామిళ్లకు వచ్చి ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. అదే విధంగా అటవీశాఖ అధికారులచే వీటి విలువ 3కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్బంగా ఏఎస్పీ రాజేంద్ర, సీఐ మురళీనాయక్‌ లతో పాటు, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు ఎస్‌ఐలను అభినందించారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు