హైదరాబాద్ (వి.వి) : ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జనగామ నియోజకవర్గ ఎన్నికపై హైకోర్టు ఆదే శాలను నిలిపివేయాలంటూ పొన్నాల వేసిన పిటి షన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అంతే కాకుండా కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పొన్నాలకు రూ.10 వేలు జరిమానా విధించింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన టిఆర్‌ఎస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు రీకౌంటింగ్ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ పొన్నాల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పొన్నాల పిటిషన్‌ను న్యాయస్థానం నేడు కొట్టివేసింది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
