విజయవాడ (వి.వి) : కోట్లాది రూపాయల గ్యాస్ నిక్షేపాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళుతుంటే సంబ ంధిత కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డా|| కె.నారాయణ విమర్శించారు. గ్యాస్ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రప్రభుత్వంపై వత్తిడి చేయాలని ముఖ్య మంత్రిని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నా రు. 'ఈ విషయంపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్ళి కేంద్రంపై వత్తిడి తెస్తావా? లేదా మమ్మల్నే వెళ్ళమంటావా?' అని సిఎంను ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి అఖిలపక్షంగా ఏర్పడి, ఢిల్లీ వెళ్ళి గ్యాస్ విషయమై తేల్చుకుంటామని చెప్పారు. విజయవాడ హనుమాన్‌పేటలో ఉన్న నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లా డారు. రాష్ట్రంలో విద్యుత్ కోత ఇంకా కొనసాగు తూనే వుందని, వినియోగదారులు అనేక ఇక్కట్లు పడుతున్నారని ఆయన అన్నారు. రైతులకు ఏడు గంటల విద్యుత్ నీటిపై రాతగానే మారిందన్నారు. ప్రభుత్వం మా చేతుల్లో లేదని చెబుతూనే ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర నడిబొడ్డున పుడుతున్న గ్యాస్‌ను రాష్ట్ర ప్రజ లకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తరలించు కుపోతుంటే, ఆడ్డుకునే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గ్యాస్ మహారాష్ట్రలోని రత్నగిరి ఫ్యాక్టరీకి తరలిపోతు న్నదని, హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీల్ కుమార్ షిండే సొంత రాష్ట్రానికి మేలు చేసుకు న్నాడని, మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. 2008లో ఒప్పందాలు జరిగిన ప్పుడు తాను లేనని జైపాల్‌రెడ్డి చెబుతున్నారని, రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా కలిసి ఆ అగ్రి మెంట్ వల్ల నష్టం జరుగుతోందని, దాన్ని రద్దు చేయండి లేదా మేమే రాజీనామా చేస్తామని ఎందు కు కేంద్రంపై వత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి క్రికెట్ ఆడుకుంటున్నారని విమర్శించారు. రంగా రెడ్డి, కరీంనగర్‌లలో జెన్‌కోకి గ్యాస్ ఇవ్వకుండా ప్రైవేట్ వారికి ఇచ్చారని, అదేమంటే మర్చంట్ పవర్ పాలసీ తెచ్చామంటున్నారని, భవిష్యత్‌లో ఈ విధంగానే వ్యవహరిస్తే సరిహద్దుల్లో గ్యాస్ పైపు లు బద్దలు కొట్టే రోజులు వస్తాయని నారాయణ హెచ్చరించారు. దీనిపై రాష్ట్ర వ్యాపితంగా నిరసనోద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మైక్రో రుణాలపై ఇప్పటికే 26 శాతం వడ్డీ పడుతుండగా, దాన్ని ఇంకా పెంచే ఆలోచనలో వున్నట్లు చెబుతు న్నారని, ఇదే జరిగితే పేద ప్రజలను మైక్రో ఫైనాన్స్ మాఫియా గ్యాంగ్‌కు బలివ్వడమేనని అన్నారు. వడ్డీ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని, మాఫియా ఆగడాలు అడ్డుకుంటామన్నారు. మైక్రో వ్యవస్థ అవసరమే లేదని, ప్రభుత్వమే ఒక మెకానిజం ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాలని ఆయన అన్నారు. డెల్టాకు నీటి విషయమై మాట్లాడుతూ శ్రీశైలంలో 15 టిఎంసిల నీళ్ళువున్నందున జూన్, జులై నెలల్లో నారుమళ్ళు వేసుకోవడానికి డెల్టాకు ఇవ్వాలని తాము చెప్పామన్నారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం అన్ని పార్టీలను పిలిచి మాట్లా డాల్సిన అవసరం వుందన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సీట్ల విషయంలో అందరికీ న్యాయం జరగాలన్నారు. అన్ని కళాశాలలను ప్రభు త్వం స్వాధీనం చేసుకుని వైద్య విద్యను అందించా లన్నారు. రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలు వుండగా, వాటిల్లో మూడింటిని ప్రభుత్వం నిర్వహిస్తోందని, ప్రభుత్వ కాలేజీల్లో ప్రమాణాలు లేవంటూ అడ్మిషన్లు నిలిపివేయడం ప్రభుత్వానికే అవమానకరమన్నారు. ఈ సమావే శంలో సిపిఐ జిల్లా, నగర కార్యదర్శి అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, సహాయ కార్యదర్శి జి. కోటేశ్వరరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా సూర్యారావు, చలసాని అజరుకుమార్ పాల్గొన్నారు. అనంతరం లెనిన్‌సెంటర్ వద్ద గ్యాస్, పెట్రోలియం మంత్రి దిష్టి బొమ్మను దగ్దం చేశారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
