కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మరి కొన్ని రోజులు అలాగే కొనసాగనున్నది. ఆస్ట్రేలియాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించే ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ మద్దతును ఎవరికి ప్రకటించాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితితో పాటు రాజకీయ వర్గాల్లో ఆత్రుత నెల కొన్నాయి. తాము నిర్ణయం తీసుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని స్వతంత్ర నేత టోని విండ్సర్ శుక్రవారం చెప్పారు. దీనిపై 'ద ఆస్ట్రేలియన్' పత్రిక వ్యాఖ్యా నిస్తూ వచ్చే వారం వరకూ నిర్ణయం వెలువడక పోవచ్చునని పేర్కొంది. మిగిలిన వారు మాత్రం ప్రధాన మంత్రి జులియా గిల్లార్డ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తున్నది. తస్మానియా నుండి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్ధి ఆండ్రూ విల్కీ గురువారం తన మద్దతు ను ప్రధానమంత్రి జులియా గిల్లార్డ్ నేతృత్వం వహిస్తున్న లేబర్ పార్టీకి అనుకూలంగా ప్రకటించిన తరువాత మిగిలిన వారు ఆమెవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో గిల్లార్డ్‌కు74 సీట్లు ఉండగా ప్రతిపక్ష అభ్యర్ధి టోని అబ్బాట్స్ లిబరల్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 73 సీట్లు ఉన్నాయి. మొత్తం సభలో 150 స్థానాలు ఉన్నాయి. న్యూ ఇంగ్లాండ్ సభ్యుడైన విండ్సర్ మాట్లాడుతూ సోమ వారం నాటికి అనిశ్చిత పరిస్ధితులు తొలిగిపోతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు కూడా గిల్లార్-అబ్బాట్‌లవైపు చీలిపోయే అవకాశాన్ని కూడా త్రోసిపుచ్చలేమని ఆయన తెలిపారు. రాబ్ ఓక్‌షాట్ మాట్లాడుతూ తాను కూడా వారాంతం వరకూ గడువు తీసుకుంటానని ప్రకటించారు. ఓక్‌షాట్, విండ్సర్, బాబ్ కట్టార్‌లు కాన్‌బెర్రాలో ఒకరితరువాత ఒకరు లేబర్ పార్టీకి చెందిన నాయకులతోనూ, సంకీర్ణ పార్టీల నేతలతోనూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. కట్టర్ మాట్లాడుతూ తనకు మరింత గడువు కావాలని, ప్రతి పదిహేనునిముషాలకు ఒకసారి తన ఆలోచన మారుతు న్నదని అన్నారు. ఈ సందర్భంగా విండ్సర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ప్రాంతంలో ప్రభుత్వం స్ధిరంగా ఉండటమే కీలక అంశమని అన్నారు. ఓక్‌షాట్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ, రీజనల్ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఒక మార్కెట్ యంత్రాంగం ద్వారా కార్బన్‌పై ధరలు నిర్ణయించే అంశానికి చర్చలు తిరిగి ప్రారంభించడం పట్ల తాను ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు. స్పీకర్ స్థానానికి గిల్లార్డ్ తరుపు అభ్యర్ధితో భర్తీ చేయాలా, అబ్బాట్ తరుపు అభ్యర్ధి తో భర్తీ చేయాలనే విషయాన్ని ముగ్గురూ తోసిపుచ్చారు. మైనార్టీ ప్రభుత్వంలో తాము మంత్రి పదవులు తీసుకోమని చెప్పారు. పార్లమెంట్ చేపట్టవలసిన ప్రతిపాదిత సంస్కర ణల జాబితాను ఆ ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు శుక్ర వారం విడుదల చేశారు. వీటిని సభలో ప్రవేశ పెట్టడానికి ముందుగా పార్లమెంటరీ కమిటీ దీనిపై చర్చ జరుపు తుంది.
కాగా మళ్ళీ త్వరలోనే ఎన్నికలు జరగకుండా ఎలా నివారించాలనే విషయమై కూడా ఇప్పటికే చర్చ జరిగినట్లు కట్టారే తెలిపారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
