జపాన్‌ దురాక్రమణపై విజయానికి 65ఏళ్ళు!

Fri, 3 Sep 2010, IST    vv
అమర వీరులకు ఘన నివాళి
యుద్ధ ప్రముఖులకు లివింగ్‌ అలవెన్స్‌
చైనా అంతటా పలు కార్యక్రమాలు

బీజింగ్‌ : రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్‌ జరిపిన దురాక్ర మణలో మరణించిన చైనా సైని కులకు చైనా అగ్ర నాయకత్వం నేడు ఘనంగా నివాళులర్పించింది. చైనాకు జపాన్‌ లొంగిపోయి 65ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ రోజు బీజింగ్‌లో పలు కార్యక్రమాలు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధ విశేషాలతో కూడిన మ్యూజియంలో చైనా అధ్య క్షుడు హూ జింటావో, ప్రధాని వెన్‌ జియాబావో, చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్‌ బ్యూరో స్థాయీ సంఘ సభ్యులు ప్రభృతులు హాజరయ్యారు. అమరవీరులను స్మరిస్తూ వారు పుష్ప గుచ్ఛాలుం చారు. రాజకీయ ప్రము ఖులు, విదేశీయులు, పౌరులు అందరూ కూడా మౌనం పాటించడం ద్వారా నివాళులర్పించారు. చైనా అంతటా శుక్రవారం అమర వీరులను స్మృత్యర్ధం పలు కార్యక్రమాలు జరిగాయి. 65వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో నివసిస్తున్న యుద్ధ ప్రముఖులకు లివింగ్‌ అలవెన్స్‌ను చైనా అందచేయనుంది. ఈ మేరకు పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జపాన్‌పై సాగిన యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా, అందులో వారు సాధించిన విజయాలకు చిహ్నంగా కమ్యూనిస్టు పార్టీ, చైనా దేశం సైనిక ప్రముఖుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించేలా ఈ అలవెన్స్‌ను ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1937 జులై 7నుండి 1945 సెప్టెంబరు 2 మధ్య కాలంలో సైన్యంలో చేరిజపాన్‌ దురాక్రమణ దారులపై పోరాడిన వారికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఫండ్‌ నుండి 3వేల ఎన్‌లు అందుతాయి. అర్హులైన వారికి ఇవి అందేలా చూడాల్సిందిగా, స్థానిక శాఖల సహకారం తీసుకోవాల్సిం దిగా పౌర వ్యవహరాల మంత్రిత్వ శాఖ, ఆర్ధిక శాఖలను ప్రభుత్వం కోరింది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ అమలు చేస్తున్న సబ్సిడీ విధానాల కింద సకాలంలో సైనిక ప్రముఖులకు ఈ అలవెన్స్‌ అందచేయాల్సి వుంటుంది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించింది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు