క్యూబన్‌ 5' పై క్యూబాలో 4వ అంతర్జాతీయ సదస్సు

Fri, 3 Sep 2010, IST    vv

హవానా : అమెరికా జైలు నుంచి క్యూబా ఉగ్రవాద వ్యతిరేకులు ఐదుగురిని విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని క్యూబా నవంబరులో 4వ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సులో 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనున్నారు. 'క్యూబన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ విత్‌ ది పీపుల్స్‌' సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఎక్స్‌పో-హోల్‌గిన్‌ మైదానంలో నవంబరు 17 నుంచి 21 వరకూ ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఇంటర్‌నెట్‌ ద్వారా ప్రత్యక్ష ఇష్టాగోష్టి నిర్వహించనున్నట్లు ఐసిఎపి అధికారి అమౌరీ టోర్నో తెలిపారు. భారత్‌, లావోస్‌, పరాగ్వే, గ్వాటెమాలా, పోర్చుగల్‌, ఇరాన్‌, శ్రీలంక, ఇథియోపియా ప్రతినిధులు తొలిసారిగా ఈ సదస్సుకు హాజరుకానున్నారు ఈ సదస్సు ద్వారా మీడియా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అధికారికంగా ఐక్యంగా తమ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు టోర్నో తెలిపారు. క్యూబన్‌ 5 విడుదలకు చట్టక్రమంపై వాస్తవాలను అందరికీ తెలియజేసేందుకు సాయపడిన న్యాయవాదులు, జర్నలిస్టులు, కాంగ్రెస్‌ సభ్యులతో పాటు చర్చి అధికారులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఫ్లోరిడా నుంచి క్యూబా వ్యతిరేక ఉగ్రవాదులు జరుపుతున్న కార్యకలాపాలను బట్టబయలు చేసినందుకు గెరార్డో హెర్నాండెజ్‌, రమోన్‌ లబానినో, ఆంటోనియో గెరీరో, ఫెర్నాండో గోంజాలెజ్‌, రెనె గోంజాలెజ్‌లను 1998లో అరెస్ట్‌ చేసిన అమెరికా రెండుసార్లు జీవితఖైదును అంటే 15 ఏళ్ళపాటు కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు