లండన్‌పై మంచుదుప్పటి

Sun, 5 Feb 2012, IST    vv
పలు విమానాలు రద్దు

లండన్‌ : లండన్‌ మంచుదుప్పటి కప్పుకుంది. ఆదివారం బయలుదేరవలసిన విమానాలలో 30శాతం రద్దు చేశారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌ చుట్టూ మంచుతెరలు కమ్ముకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వున్న అంతర్జాతీయ విమానాశ్రయం హీత్రూలో 10 సెంటీమీటర్ల హిమపాతం వుండగలదని భావిస్తు న్నారు. ఫలితంగా విమానాశ్రయ కార్యకలాపాలకు అంత రాయం ఏర్పడింది. చలి వాతావరణం కారణంగా ప్రయా ణీకులకు కలిగిన అసౌకర్యానికి హీత్తూ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి నార్మండ్‌ బోల్విన్‌ విచారం వ్యక్తం చేశారు. దక్షిణ స్కాట్లాండ్‌, వేల్స్‌లోని కొన్ని ప్రాంతాలలో మంచు విపరీతంగా కురవడంతో శనివారం నుండి రోడ్డు మార్గంలో కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహ నాలు తిరగడానికి వీలుగా 10000 టన్నులకు పైగా ఉప్పు రాజధాని రోడ్లపై చల్లారు. మంచు తొలగిం చడానికి వీలుగా స్టాన్‌స్టెడ్‌ విమానా శ్రయాన్ని తాత్కాలికంగా మూసి వేశారు. యూరప్‌ అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు