వాషింగ్టన్ : బర్మాపై ఉన్న ఆంక్ష లను తొలగిస్తామని అమెరికా ప్రక టించింది. బర్మా నాయకులు అమె రికా పర్యటనకు వచ్చేందుకు అను మతితో పాటు ప్రయాణ, ఆర్థిక ఆం క్షలను తొలగిస్తామని అమెరికా విదే శాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ చెప్పారు. ఇలాంటి చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని యూరోపియన్ యూనియన్ నాయ కులు కూడా ప్రకటించారు. ఆది వారం జరిగిన బర్మా ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల నాయకుల రాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు ఆమె నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ ఎల్‌డి) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి మొత్తం 45 స్థానాలకు 43 సీట్లను గెలుచుకుంది. ఈ నేప థ్యంలో అమెరికా ఆంక్షలను ఎత్తే యనున్నట్లు ప్రకటించింది. బర్మా అధ్యక్షుడు థెయిన్‌ఖ సేన్ నాయ కత్వం, ధైర్యాన్ని హిల్లరీ క్లింటన్ ప్రశంసించారు. ఆ దేశంలో పురోగ తిని మేము గుర్తించాం. ఈ నేప థ్యంలో మా విధానాలను కొనసాగి స్తాం' అని ప్రకటించారు. బర్మాలో అమెరికా రాయబారిని ప్రకటిస్తా మని, ఆ దేశంలో అంతర్జాతీయ అభివృద్ధి కోసం తమ ఏజన్సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు బర్మాలో పెట్టుబడులు, అమెరికా ఆర్థిక సేవలపై నిషేధాన్ని తొలగింపు ప్రక్రియను అమెరికా ప్రారంభిస్తుందని వివరించారు. అయితే వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఇంతకు ముందు ఫిబ్రవరిలో బర్మాపై అమెరికా కొన్ని ఆంక్షలను తొల గించిన విషయం తెలిసిందే. దేశంలో రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం బర్మాపై ఆంక్షలను తక్షణమే తొలగించాలని ఇటీవల జరిగిన ఆసియా నాయకుల సమావేశం డిమాండ్ చేసిన నేపథ్యంలో అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
