స్పష్టమైన మెజారిటీ వస్తుంది

Sun, 17 Jun 2012, IST    vv
పార్లమెంట్‌ ఎన్నికలపై హోలాండే ఆశాభావం

పారిస్‌ : పార్లమెంట్‌ ఎన్నికలలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ జాతీయ అసెంబ్లీ లేదా పార్ల మెంట్‌ దిగువ సభకు తుది దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం పోలింగ్‌ జరిగింది. అధ్యక్షుడు హోలాండేకు చెందిన సోషలిస్టు పార్టీ (పిఎస్‌) ఘన విజయం సాధించే సంకే తాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 577 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో గత వారాంతంలో జరిగిన తొలి దశ పోలింగ్‌లో 35 నియోజకవర్గాల్లో మాత్రమే స్పష్టమైన మెజా రిటీ కనిపించింది. సోషలిస్టు పార్టీ, దాని రాజకీయ భాగ సామ్యపక్షాలు 313 స్థానాల వరకు గెలుచుకుంటాయని శుక్రవారం విడుదలైన సర్వే పేర్కొంది. పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ కావాలంటే 289 స్థానాలు అవసరం. గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్‌ సర్కోజీని ఓడించి గద్దెనెక్కిన హోలాండే తమ విధానాలకు ప్రజలు మద్దతునిస్తారని తమకు ఘనవిజయం కట్టబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధి మీద దృష్టిసారించ డంతో సహా యూరోజోన్‌ సంక్షోభంపై పోరాడుతున్న తమ విధానాలకు ప్రజలు ఓటు చేస్తారని అన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు