స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం మహేష్ 'ఖలేజా' ప్రేక్షకాభిమానులకు దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం కోసం బ్యాలెన్స్ వున్న 'మకతిక మశ్చీంద్రా' అంటూ సాగే చివరి పాటను పలు భారీ సెట్స్ వేసి సెప్టెంబరు 5 నుంచి 8 వరకూ మహేష్ అనుష్కలపై ప్రేమ్ రక్షిత్ డాన్స్ డైరెక్షన్‌లో చిత్రీకరించనున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటివరకూ గోప్యంగావున్న ఈ చిత్రం కధాంశం గురించి ఇప్పుడిప్పుడే ఇండిస్టీలో వేడివేడిగా చర్యలు మొదలవుతున్నాయి.
దాదాపు 40 ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన బాలీవుడ్ క్లాసిక్‌కి 'ఖలేజా' జిరాక్స్ కాపీ అనే విషయం విశ్వసనీయంగా తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌ని తన శైలిలోకి మార్చి మిగిలిన కధాంశాన్ని మాత్రం సేమ్ స్కేల్‌లో ఫామ్ చేసేశారట త్రివిక్రమ్. మరింతకీ ఆ బాలీవుడ్ క్లాసిక్ ఏంటీ అంటారా ఆ టైటిల్ ఇప్పుడే చెప్పేయడం ఎందుకులెండి. ఈ వార్త పూర్తిగా నిజమేనని నిర్ధారణ అయితే అప్పుడా గుట్టుని బయటపెట్టేయ్యొచ్చు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
