'రక్త చరిత్ర ' సినిమాను అడ్డుకుంటాం : పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌

Thu, 2 Sep 2010, IST    vv

రామ్‌గోపాల్‌వర్మ సినిమా రక్త చరిత్ర మరో వివా దంలో చిక్కుకుంది. ఆ సినిమాపై పవన్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌కు గుండు గీయించిన సీన్‌ సినిమాలో ఉంటే సహించబోమని వారురామ్‌గోపాల్‌వర్మను హెచ్చరించారు. ఆ సీన్‌ ఉంటే స్క్రీన్లు చించేస్తామని వారు ఓ ప్రముఖ టీవి ఛానెల్‌ ప్రతి నిధితో అన్నారు. సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని వారు చెప్పారు. హత్యకు గురైన పరిటాల రవి ఓ భూ వివాదంలో పవన్‌ కళ్యాణ్‌కు గుండు గీయించి అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై పవన్‌ కళ్యాణ్‌ ఆ వార్తాకథనం ప్రచురించిన పత్రికా కార్యాలయం వద్ద ప్రదర్శనకు దిగారు. కాగా పవన్‌ కళ్యాణ్‌, కొమరం పులి 9వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు. ఆ సినిమా విడుదల కోసం అభిమా నుల మాదిరిగానే తాను ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు. రీరికార్డింగ్‌ వల్ల విడుదలలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. కొమరంపులి హక్కులను తాను కొన్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని ఆయన చెప్పారు. నిర్మాతనే ఆ సినిమానువిడుదల చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు