రెగ్యులర్‌ షఉటింగ్‌లో కుమార్‌ బ్రదర్స్‌ చిత్రం

Thu, 2 Sep 2010, IST    v

సుమంత్‌, ప్రియమణి, విమలా రామన్‌ హీరో హీరోయిన్స్‌గా విజి శిపివిష్టా దర్శకత్వంలో కుమార్‌ బ్రదర్స్‌ సినిమా పతాకంపై కుమార్‌ బ్రదర్స్‌, గౌటి హరినాథ్‌లు కలిసి నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరా బాద్‌లో శరవేగంగా షఉటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు కుమార్‌ బ్రదర్స్‌ మాట్లా డుతూ 'నవ్యమైన కథ, కథనాలతో అన్ని వర్గాలు మెచ్చే రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందు తున్న చిత్రమిది. సుమంత్‌ పాత్ర కొత్తగా ఉంటుంది. అతని కెరీర్‌లో ఇప్పటి వరకు పోషించనటువంటి విభిన్నమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాడు. ప్రస్తుతం సుమంత్‌, ప్రియమణి, విమలారామన్‌, ఇతర ముఖ్యతారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. 15 రోజుల పాటు అక్కడి పలు అంద మైన లోకెషన్స్‌లో షఉటింగ్‌ చేస్తాం' అన్నారు. దర్శకుడు విజి శిపివిష్టా మాట్లాడుతూ 'కథ, కథనాలే ప్రధాన బలాలుగా నిర్మాణం జరుపుకుంటున్న అన్ని భావోద్వేగాలు వుంటాయి. వినోదంతో పాటు సెంటిమెంట్‌కు కూడా ఈచిత్రంలో పెద్ద పీట వేశాం. తప్పకుండా చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. డా||బ్రహ్మానందం, వేణుమాధవ్‌, శ్రీనివాస్‌రెడ్డి, షయాజీషిండే, తెలంగాణా శకుంతల, కల్పన, గిరిబాబు, వైజాగ్‌ ప్రసాద్‌, గుండు హనుమంతరావు, జెన్నీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమానికి సంగీతం : కోటి, ఎడిటింగ్‌ : కె.వి.కృష్ణారెడ్డి, కెమెరా : జాన్‌, ప్రాజెక్ట్‌-కో-ఆర్డినేటర్‌ : ఆర్‌.దీలిప్‌ సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : ఏ.పాండు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం :విజి శిపివిష్టా.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు