కృష్ణవంశీతో రామ్‌చరణ్‌

Thu, 2 Sep 2010, IST    vv

రీసెంట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి నుండి క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న కృష్ణవంశీకి కబురొచ్చింది. ఎప్పటినుంచో ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఆఘమేఘాలమీద చిరు క్యాంప్‌లో వాలి ఓ స్టోర్‌లైన్‌ని అర్జెంటుగా నేరేట్‌ చేసేశారు. అదివిన్న... చిరంజీవి ఇంప్రెస్‌ అయిపోయి తన కుమారుడు రామ్‌చరణ్‌తో సినిమా చేయమని చెప్పారని విశ్వసనీయ సమాచారం. ఆ కథ కొద్దిగా ఆధ్యాత్మికతను ముడివేసుకుని ఉంటుందని అప్పట్లో కృష్ణవంశీ తయారు చేసుకున్న జెండాపై కవిపరాజు కదే అది అని చెప్పుకుంటున్నారు. నిజానికి జెండాపై కపిరాజు చిత్రాన్ని విష్ణువర్థన్‌ కోసం అని కృష్ణవంశీ రెడీ చేయించారు. సూపర్‌హిట్‌ ది న్యూ డ్రాగన్‌ చిత్రంలోని లైన్‌ని మన నేటివిటీకి మార్చి సీతాదేవి విగ్రహం కోసం ముంబై వచ్చే (ఆంజనేయుడు లాంటి) యువకుడు కథగా అది తయారైంది. ఇప్పుడదే రామ్‌చరణ్‌ కోసం చెప్పి ఉండవచ్చునని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని పిఆర్పీ లీడర్‌ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు నిర్మిస్తారు. రామ్‌చరణ్‌ తాజా చిత్రం ఆరెంజ్‌ షఉటింగ్‌ పూర్తికాగానే ఈ సినిమా ప్రారంభమవుతుంది. మరో పక్క రామ్‌చరణ్‌ మెరుపు చిత్రం షఉటింగ్‌లో బిజీగా ఉన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు