ఇద్దరు సూపర్‌ స్టార్లతో చేయడం పూరీకి ఛాలెంజ్‌

Sat, 4 Feb 2012, IST    vv

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ లమితాబచ్చన్‌, తమిళసూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారు. 28 ఏళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇది. గతంలో వీరిద్దరు కలిసి 'హమ్‌', 'అం ధాకానూన్‌','గిరిఫ్తార్‌' చిత్రాల్లో నటించారు. త్వరలో పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందబోయే ఓ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నారట. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని రూపొందించాలని చాలా రోజులుగా పూరి జగన్నాధ్‌ వేచి చూస్తున్నాడట. చివరకు వీరికోసం స్క్రీప్టుని తయారు చేసుకుని ఇటీవలే రజనీకాంత్‌కి వినిపించాడట. కథ నచ్చడంతో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నారట రజనీకాంత్‌. దీనిపై పూరి స్పందిస్తూ-'' ఇటీవలే చెన్నైలో రజనీకాంత్‌ని కలిశా. చాలా కాలం నుంచి ఆయనతో పనిచేయాలని ఉంది. సరైన కథ లేక ఇన్నాళ్ళు ఆయనను కలవడానికి ధైర్యం చేయలేకపోయా. అమితాబ్‌, రజనీకాంత్‌ని కలిపి డైరెక్ట్‌ చేయాలనేది నా జీవితాశయం'' అన్నారు.

చాలా కాలం తరువాత మా ఇద్దరితో సినిమా చేయాలనే ఆలోచన పూరికి రావడం చాలా సంతోషంగా ఉందని రజనీ, అమితాబ్‌ అన్నారు.

వీరిద్దరి క్యారెక్టర్లను సమర్థవంతంగా తెరై ఆవిష్కరించే సత్తా ఒక్క పూరికే సాధ్యమని వారు భావిస్తున్నారట. ఇద్దరు సూపర్‌స్టార్లతో సినిమా చేయడం తనకు ఓ ఛాలెంజ్‌ అంటున్నారు పూరి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు