కొత్త మొహాలు, పాతకథ

Sat, 14 Apr 2012, IST    vv
కొత్త మొహాలు, పాతకథ

తేజ దాదాపు నాలుగేళ్లతర్వాత మెగాఫోన్‌ పట్టుకున్న సినిమా 'నీకు నాకు డాష్‌ డాష్‌'. జయం, నువ్వు నేను, వంటి యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీలను తీసిన తేజ ఈసారి కూడా అలాంటి యూత్‌ ప్రేమకథను తెరకెక్కించారు. కొత్తమొహాలు. కొత్త బ్యాక్‌డ్రాప్‌తో ముందుకు వచ్చాడు. డబ్బు అవసరంరీత్యా శివ (ప్రిన్స్‌), తూఫాన్‌బాబు (సుమన్‌ శెట్టి) చట్టవ్యతిరేకంగా లిక్కర్‌ బాట్లింగ్‌ చేసే ప్లాంట్‌ లో పనిచేస్తారు. అక్కడే గాయత్రి (నందిత) పనిచే స్తుంటుంది. ఆ వ్యాపారం ఓ పొలిటీషన్‌ది. కానీ, లోకల్‌గూండా అయిన బాపినీడు పర్యవేక్షణలో సాగుతుంది. అతనికి చిట్టితల్లి (తీర్థ) కీప్‌. అక్కడి ఆర్థికవ్యవహారాలు పరుచూరి వెంకటేశ్వర్లు చూస్తాడు.

అనుమానంతో ఆ ఏరియా పోలీసు ఎస్‌ఐ బెనర్జీ రైడ్‌చేసినా ప్రూఫ్‌ దొరకదు. మరోవైపు శివ నిజాయితీ, అమాయకత్వం చూసి గాయత్రి ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడ ఓసంఘటన జరుగుతుంది. దాంతో వారికి దొరికిన డబ్బు సంచితో పారిపోతారు. వీరికోసం మాఫియా ఛేజింగ్‌ చేస్తుంది. మరోవైపు పోలీసులు ఈ లిక్కర్‌ మాఫియాను ఛేజింగ్‌ చేస్తారు. ఆ తర్వాత ఏమయింది? అన్నదికథ. దర్శకుడు తేజ తన ఫార్మెట్‌ను ఏ మాత్రం మార్చలేదు. టీనేజ్‌ యువకుల ప్రేమ, పెద్దలు ఒప్పుకోకపోవడం, ఛేజింగ్‌లు.. చివరికి గెలుపు... అయితే ఈసారి లిక్కర్‌ మాఫియా అనే కొత్త బ్యాక్‌గ్రౌండ్‌ తీసుకున్నారు. ఇది తను ఎప్పుడో రాసుకున్నా... ఇప్పటి లిక్కర్‌మాఫియా చర్చకు ఏదో బ్రహ్మాండాన్ని బద్దలుకొడతాదనే ఆలోచనల్ని రేకెత్తించింది. హీరో అమాయకుడు, హీరోయిన్‌ తెలి విగల పాత్రను ఎంచుకుని ఇంట్ర స్ట్‌ను క్రియేట్‌చేశారు. మొదటి భాగాన్ని చక్కగా ఎంటర్‌టైన్‌ మెంట్‌, పాటలతో లాగించేశారు. సుమన్‌శెట్టిని బాగా ఉపయోగించు కున్నారు. కథాగమనంకూడా క్లారిటీగా చూపించారు. కానీ రెండోభాగం వచ్చేసరికి ఫారెస్ట్‌ ఎపిసోడ్‌, ఛేజింగ్‌, యాక్షన్‌లతో కాస్త లాగ్‌ చేశాడు. పైగా మూడు గంటల సినిమా కాబట్టి ఓపిగ్గా చూడాల్సి వస్తుంది. ప్రధానంగా చెప్పాల్సింది సెకండాఫ్‌లో యాక్షన్‌ ఓవర్‌గా వుండడమే. ఈ భాగమంతా కొన్నిచిత్రాల ప్రభావం కన్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఒక్కసారిగా టెంపోడ్రాప్‌ అయి పోతుంది. నటీనటుల పరంగా ప్రిన్స్‌ కొత్తయినా తన అభినయాన్ని కొన్ని చోట్ల బాగా చూపించాడు. నందిన బాగానే చేసింది. ఆమెను చూస్తుంటే గతంలో రాజేశ్వరి గుర్తుకువస్తుంది. అయితే.. డైలాగ్‌ డెలివరీని ఇంకా ఇంప్రూవ్‌ చేసుకోవాలి. సుమన్‌శెట్టి చాలాకాలం తర్వాత మంచి ఎంటర్‌టైన్‌ చేశారు. పతాక సన్నివేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. రసూల్‌ సినిమాటోగ్రఫీ సెకండా ఫ్‌లో అద్భుతంగా వుంది. తేజ సంభాషణలు క్యాచీగా వున్నాయి. కొత్తగా పరిచమైన యశ్వంత్‌ నాగ్‌ మ్యూజిక్‌ బాగానేచేశారు. అయితే అనూప్‌ రూబెన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సరిపోయింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ పర్వాలేదు. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ను భవ్యక్రియేషన్స్‌ అద్భుతంగా చూపించింది. 'సొంత ఊరు' నటి తీర్థ ఫెరోషియస్‌ నటనను కనబర్చింది. పాత్రకు తగినవిధంగా దర్శ కుడు మలిచారు. టోటల్‌గా తేజ దర్శకత్వ టాలెంట్‌ను ఉపయోగించి ఆసక్తికరంగా తెరకె క్కించాడు. ఇది నేటి యూత్‌ను ఎంతమేరకే చేరువ తుందో చూడాలి. నటీనటులు: ప్రిన్స్‌, నందిత, తీర్థ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బెనర్జీ, దువ్వాసి మోహన్‌ తదితరులు. కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, కథ, కథనం, దర్శకత్వం: తేజ, నిర్మాత: ఆనంద ప్రసాద్‌, బేనర్‌ భవ్య సిమెంట్స్‌.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు