'23న 'మేం వయసుకు వచ్చాం'

Sat, 16 Jun 2012, IST    vv

లక్ష్మణ్‌ సినీ విజన్‌ సమర్ప ణలో...లక్కీ మీడియా పతాకంపై త్రినాధరావు నక్కినను దర్శకుడిగా పరిచయం చేస్తూ బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)-లక్ష్మణ్‌ క్యాదారి సంయుక్తంగా నిర్మిస్తున్న 'మేము వయసుకు వచ్చాం' ఈనెల 23న విడుదలవుతోంది. గంటా నాగేశ్వర్రావు సహ నిర్మాతగా కిషోరి బసిరెడ్డి(డిజిక్వెస్ట్‌) నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ లభించడం విశేషం. తనీష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నీతి టేలర్‌ హీరో యిన్‌గా పరిచయమవుతుండగా, మదాలసశర్మ మరో హీరోయిన్‌గా నటి స్తోంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్‌ (గోపి), లక్ష్మణ్‌ క్యాదారి, దర్శకుడు త్రినాధరావు నక్కిన, సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర, బెంగుళూరు డిస్ట్రిబ్యూటర్‌ అర్జున్‌, కథా రచయితలు నివాస్‌, ఉదరు భాగవతుల తదితరులు పాలుపంచు కున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ''సెన్సార్‌ నుంచి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ అందుకోవడం తమ చిత్రం సాధించిన తొలి విజయంగా పేర్కొన్నారు. సినిమా టైటిల్‌ను బట్టి ఇదేదో కుర్రాళ్లు మాత్రమే చూడదగ్గ చిత్ర మనే అపోహను సెన్సార్‌వారు ఇచ్చిన క్లీన్‌ సర్టిఫికెట్‌ తొలగించిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రేమలోని ఒక కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవి ష్కరిస్తూ రూపొందిన 'మేం వయసుకు వచ్చాం' అన్ని వయసు లవారిని అలరి స్తుందని.. శేఖర్‌చంద్ర అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తుందని, తనీష్‌ కెరీర్‌లో చాలా గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రంగా ఇది రూపు దిద్దుకుందని, భాగ్యరాజా పోషిస్తున్న ప్రత్యేక పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని, ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నామని'' అన్నారు. రమాప్రభ, సన, కాశీవిశ్వనాధ్‌, సూర్య, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, రక్ష ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కౌషీన్‌ మహ్మద్‌ సిద్దిఖి!!


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు