కార్తీ, ప్రణీత జంటగా నటిస్తున్న చిత్రం 'శకుని'. తమిళం, తెలుగు భాషల్లో ఈనెల 22న విడుదలకానుంది. జ్ఞానవేల్ సమర్పణలో శంకర్‌దయాళ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని తమిళంలో జ్ఞానవేల్ విడుదలచేస్తుంటే, తెలుగులో శ్రీఆసియగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ విడుదలచేస్తున్నారు. కార్తీ మాట్లాడుతూ ఇందులో రకరకాలషేడ్స్ వుంటాయి. కథప్రకారం అవి పోషించాల్సివస్తుంది. రాజకీయనేపథ్యంలో సాగే చిత్రమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ భారతంలో శకుని పాత్ర నెగెటివ్‌గా వుంటుంది. కానీ మేథావి అతను. ఇందులో శకుని పాత్ర చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుంటుంది. ప్రత్యర్థులకు ఎత్తులు పైఎత్తులు ఎలావేసి సక్సెస్ అవుతాడనేది పాయింట్ అని చెప్పారు. ఇందులో సాహితీ రాసిన పాటలు చాలా బాగున్నాయి. ఇంతకుముందు కార్తీ చిత్రాలకు తనే రాశాడు. ఆడియోపరంగా మంచి హిట్ అయిందన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
