నారా రోహిత్‌ 'మద్రాసి'

Sat, 4 Aug 2012, IST    vv

'బాణం'తో హీరోగా పరిచయమైన 'సోలో' వంటి సూపర్‌హిట్‌తో మంచి పేరు తెచ్చుకున్న యంగ్‌ హీరో నారా రోహిత్‌. కథానాయకుడిగా వల్లభనేని రోశయ్య సమర్పణలో వెంకట సూర్యతేజ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రస్థానం 'నిర్మాత రవి వల్లభనేని నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మద్రాసి'. ప్రముఖ దర్శకులు గుణ్ణం గంగరాజు వద్ద 'అమ్మ చెప్పింది', చంద్ర శేఖర్‌ ఏలేటి వద్ద 'ఒక్కడున్నాడు' చిత్రానికి దర్శకత్వం శాఖలో పనిచేసిన లింగమనేని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. హీరో నారా రోహిత్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ క్లాప్‌నివ్వగా, డా||మాడుగుల నాగఫణిశర్మ కెమెరా స్విచాన్‌చేశారు. డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సాగర్‌ ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో 'ఈగ' నిర్మాతసాయి కొర్రపాటి, ప్రముఖ నిర్మాత సి.వి.రెడ్డి,మల్లిడి సత్యనారాయణరెడ్డి, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్‌ మాట్లాడుతూ ''ఇది ఒక రివెంజ్‌ ఫార్మాట్‌లో వుండే సినిమా. రివెంజ్‌ ఫార్మాట్‌ అయినప్పటికీ డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో మంచి కమర్షియల్‌ టచ్‌ వుంటుంది. లింగమనేని రెండు సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్‌పైన వర్క్‌ చేస్తున్నారు. ఈ సబ్జెక్టు నాకు బాగా నచ్చి చేస్తున్నాను' అన్నారు. నిర్మాత రవి వల్లభనేని మాట్లాడుతూ -''ప్రస్థానం తర్వాత చేస్తున్న మరో మంచి సినిమా ఇది. ఎమోషన్‌తో కూడిన మంచి సబ్జెక్ట్‌ ఇది. నారా రోహిత్‌ కెరీర్‌లో ఇది మరో మంచి సినిమా అవుతుంది. యాక్షన్‌, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షఉటింగ్‌ ఆగస్ట్‌ నుంచి అండమాన్‌, గుజరాత్‌, ఢిల్లీ, హైదరాబాద్‌లలో జరుగుతుంది'' అన్నారు. దర్శకుడు లింగమనేని మాట్లాడుతూ -'' ఈ సబ్జెక్ట్‌లో వున్న నావెల్టీ బాగా నచ్చడం వల్లే నారారోహిత్‌ ఈ సినిమా చేస్తున్నారు. నిర్మాత రవిగారు కూడా ఈ సబ్జెక్ట్‌ విని ఎంతో ఇంప్రెస్‌ అయి మంచి టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు'' అన్నారు.ఈ చిత్రానికి సంగీతం : రాధన్‌, సినిమాటోగ్రఫీ : అరవిందన్‌ పి.గాంధీ, ఆర్ట్‌:మురళి కొండేటి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు