కొలంబో : ద్వైపాక్షిక సైనిక సంబంధాలకు వూతమిచ్చేలా భారత సైనిక జనరల్ వి.కె.సింగ్ ఆదివారం నుండి ఐదు రోజుల పాటు శ్రీలంకలో పర్యటిం చనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై వారు చర్చిస్తారు. ఈ పర్యటనా సమయంలో రక్షణ కార్యదర్శి జి.రాజపక్సే, శ్రీలంక ఆర్మీ చీఫ్ జగత్ జయసూర్య, ఇతర సీనియర్ రక్షణ అధికారులను సింగ్ కలుసు కుంటారు. శ్రీలంకలో ఎల్‌టిటిఇపై సాగించిన 'ఆపరేషన్ పవన్' సందర్భంగా విశిష్ట సేవలందించినందుకు యుద్ధ సేనా మెడల్ పొందిన సింగ్ శ్రీలంక ఉత్తర ప్రాంతంలో యుద్ధంతో అతలాకుతలమైన వావునియా ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు. త్వరలో విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు కూడా నాలుగు రోజుల పాటు శ్రీలంకలో పర్యటించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ఐదుగురు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు ఈ నెల్లో శ్రీలంకలో పర్యటించనున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అక్టోబరులో కొలంబో రానున్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ పి.వి.నాయక్, రక్షణ కార్యదర్శి ప్రదీప్ కుమార్‌లు కూడా పర్యటించాల్సి వుంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
