హవాల్దార్‌ను హతమార్చిన మావోయిస్టులు

Fri, 3 Sep 2010, IST    vv
సహచరులను విడుదల చేయాలని డిమాండ్‌
పోలీసులను విడిపించేందుకు బీహార్‌కు కేంద్రం మద్దతు

లఖిసరారు/పాట్నా/ న్యూఢిల్లీ : బీహార్‌ మిలటరీ పోలీసు విభాగంలో హవల్దార్‌గా పనిచేస్తున్న లుకాస్‌ తెతే మృత దేహాన్ని శుక్రవారం ఇక్కడి లఖిసరారు ప్రాంతం నుండి అధికారులు స్వాధీనం చేసకున్నారు. మావోయిస్టుల చేతిలో బందీలుగా ఉన్న తమ సహచరులను కాపాడు కునే ప్రయత్నాలను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. అయినా జైలులో ఉన్న తమ సహచరులను మూడు రోజుల్లో విడిచిపెట్టకపోతే బందీలను హత మారుస్తామని మావోయిస్టులు చేసిన హెచ్చరికకు గడువు ముగియడంతో తెతేను హత్య చేశారు. లఖిసరారు పోలీసు సూపరింటెండెంట్‌ రంజిత్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలోనని కజ్రా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న సిమ్రతరి శ్రింగిరిషి డ్యామ్‌ వద్ద లుకాస్‌ తెతే మృతదేహాన్ని కనుగొన్నట్లు చెప్పారు. మావోయిస్టులు అపహరించిన పోలీసులలో లుకాస్‌ తెతే ఒకరని ఆయన తెలిపారు. ఆ పర్వత ప్రాంతాలలోని అడవుల మధ్య ఉన్న ఒక రహదారిపై రక్తపు మడుగులో తెతే మృతదేహం ఉన్నదని ఆయన చెప్పారు. మృతదేహం ప్రక్కనే మావోయి స్టులు రాసిన ఒక లేఖ కూడా ఉంది. జైలులో ఉన్న తమ ఎనిమిది మంది సహచరులను విడిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లయితే తమ వద్ద బందీలుగా ఉన్న మిగిలిన ముగ్గురికి కూడా ఇదే గతి పడుతుందని ఆ లేఖలో వారు రాసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తమ డిమాండ్‌ పట్ల గురువారం సాయంత్రం నాలుగు గంటలకల్లా ప్రభుత్వం స్పందించకపోతే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అభరు యాదవ్‌ను హతమారుస్తామని స్వయం ప్రకటిత మావోయిస్టు ప్రతినిధి అవినాష్‌ గురువారం హెచ్చరిం చారు. అయితే అభరు మృతదేహం ఎక్కడ ఉన్నదో ఇంకా గుర్తించలేదు. అభరు మరణించినట్లు అధికారి కంగా ఎవరూ ధృవీకరించలేదు. ''లఖిసరారు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మావోయి స్టులు అపహరించిన పోలీసులను కాపాడేందుకు సిఆర్‌పిఎఫ్‌, బిఎంపి, ఎస్‌టిఎఫ్‌, బీహార్‌ పోలీసులకు చెందిన ఎస్‌ఎపి ఉమ్మడి బలగాలతో కూడిన కోబ్రా బెటాలియన్‌ తీవ్రవాద నిరోధక కార్యకలాపాలను ము మ్మరం చేశాయి.'' అని తీవ్రవాద నిరోధక కార్యకలా పాలను పరిశీలిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఆపరేషన్స్‌) కె.ఎస్‌.ద్వివేది తెలిపారు. మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్నవారిని రక్షించే ప్రక్రియలో భాగంగా మావోయి స్టులను వేటాడి పట్టుకునేందుకు కోబ్రా బెటాలియన్‌ సిబ్బందిని బిఎస్‌ఎఫ్‌ దళాలు హెలికాప్టర్లలో తీసుకు వెళ్తున్నాయని ద్వివేది తెలిపారు. దరహర,కజ్రా, బీహార్‌లోని మంగర్‌, జమూరు,లఖిసరారు జిల్లాలోని పలు అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అభరుదేవ్‌ మృతదేహాన్ని పోలీసులు ఇంకా కనుగొనలేదని ద్వివేది తెలిపారు. లఖిసరారు జిల్లాలోని కజ్రా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న అడవులలో ఆయన మృతదేహాన్ని పడవేసి నట్లు మావోయిస్టులు తెలిపారు. ఈ నేపధ్యంలో ముఖ్య మంత్రి నితీష్‌ కుమార్‌ తన అధికార నివాసంలో అత్య వసర సమావేశం నిర్వహించారు. అంతకుముందు అవి నాష్‌ అన్ని మీడియా కార్యాలయాలకు ఫోన్‌చేసి యాదవ్‌ హత్యకు సంబంధించి హెచ్చరించారు. బీహార్‌ లోని వేరువేరు కారాగారాలలో ఉంచిన తమ సహచరులను విడుదల చేసి, తమ వద్ద బందీలుగా ఉన్నవారికి స్వేచ్ఛ కల్పించడానికై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా అవినాష్‌ తెలిపారు. ''ఎవరికైనా హాని తలపెట్టడం అమానవీయమని మాకు తెలుసు. కాని మా వాళ్ళను విడిపించుకోవడానికి ఇంతకు మించి ప్రత్యామ్నాయం మాకు కనిపించడం లేదు. చర్చలపట్ల ప్రభుత్వానికి నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే అది దాడులను ఆపి చర్చలకు మార్గం వేయాలి.'' అని అవినాష్‌ అన్నారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గురువారం మావోయిస్టు లను చర్చలకు ఆహ్వానించారు. జైలులో ఉన్న తమ సహచరులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరిం చకపోతే తమ నిర్బంధంలో ఉన్నవారిని హతమారుస్తామని మావోయిస్టులు గురువారం హెచ్చరించారు. సబ్‌ఇన్‌ స్పెక్టర్లు రూపేష్‌కుమార్‌, యాదవ్‌, బిఎంపి హవాల్దార్‌ ఏతేషమ్‌ ఖాన్‌, బిఎంపి ఎఎస్‌ఐ తేతేలను అపహరించుకు పోయారు. కజ్రా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఎన్‌కౌం టర్‌ జరిగిన తరువాత మావోయిస్టులు వీరిని అపహరించుకు పోయారు.

కేంద్రం పూర్తి మద్దతు : మావోయిస్టుల నిర్బంధంలో ఉన్న పోలీసులను విడిపించేందుకు బీహార్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ''ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే ఎదుర్కో వాలి.దానికి మేముపూర్తి మద్దతు ఇస్తాము. మేము ఇప్పటికే గురువారంఒక హెలీకాప్టర్‌ను, శుక్రవారం మరో హెలీకాప్టర్‌ను ఇచ్చాం. బలగాలకు ఏది అవసరమో దానిని మేము సమకూరుస్తాం.'' అని హోం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కాశ్మీర్‌సింగ్‌ తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు