ముంబయి : భారత రిజర్వు బ్యాంకు మార్చి 17న వార్షిక రుణ విధానాన్ని ప్రకటించిన తరువాత పరపతి రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బిఐ) శనివారం ప్రకటించింది. ''భవిష్య త్‌లో వడ్డీరేట్లు తగ్గించేందుకే మేము చూస్తున్నాము. కాని అది రిజర్వు బ్యాంకు ప్రకటించే నగదు నిల్వ నిష్పత్తి(క్యాష్ రిజర్వు రేషియో)పై ఆధారపడి ఉంటుందని ఎస్‌బిఐ మేనే జింగ్ డైరెక్టర్, గ్రూప్ ఎగ్జిక్యూ టివ్(నేషనల్ బ్యాంకిం గ్) ఎ. కృష్ణ కుమార్ తెలిపారు. ఇక్కడ జరిగిన 6వ అంతర్జాతీయ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తూ ఆయన పైవిషయాలు తెలిపారు. నగదు నిల్వ నిష్పత్తిలో కోత ఉండే అవకాశ మున్న దని, రెపో రేటులో కోత ఉండక పోవచ్చు నని ఆయన తెలిపారు. రిజర్వుబ్యాంకులో బ్యాంకులు డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్ ఆర్) అంటారు. ప్రస్తుత సిఆర్‌ఆర్ 4.75 శాతంగా ఉన్నది. కాగా అంతకు ముందు ఎస్‌బిఐ ఛైర్మర్ ప్రతీప్ చౌదరీ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు వార్షిక విధానంలో సిఆర్ ఆర్‌ను 0.75 శాతం తగ్గించే అవకాశమున్నదని చెప్పారు. కాని స్వల్పకాలిక వడ్డీ రేట్టు ప్రస్తుత మున్న 8.5 శాతం స్థాయిలోనే ఉండే అవకాశమున్నదని చెప్పారు. కాగా విద్యారుణాలపై వడ్డీ రేట్లను తాము ఇప్పటికే తగ్గించినట్లు కుమార్ తెలిపారు. అదే విధంగా ఎస్‌ఎమ్‌ఇ సెక్టర్‌లో కూడా వడ్డీ రేట్లను తగ్గిం చను న్నట్లు చెప్పారు. ఇతర రంగా లలో వడ్డీ రేట్ల తగ్గింపుపై మాట్లా డుతూ రిజర్వు బ్యాంకు ప్రకటిం చనున్న వార్షికద్రవ్య విధానంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాలలో 20-25 శాతం ఆర్థిక వృద్ధిని ఎస్‌బిఐ లక్ష్యంగా పెట్టుకున్నదని కుమార్ చెప్పారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
