షిల్లాంగ్ : మేఘాలయలోని దక్షిణ గారోహిల్స్ జిల్లా శివారులో ఉన్న ఒక ప్రైవేట్ బొగ్గుబావిలో శుక్రవారం నుండి కనీసం 15మంది మైనర్లు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు గురువారం జాతీయ విపత్తు, సహాయక దళం సహాయక చర్యలను ప్రారంభించాయి. శుక్రవారం సాయంత్రం నొంగల్‌బిబ్రా ప్రాంతంలోని నెంగ్‌ఖొల్ వద్ద తొవ్వి వదిలేసిన గని గోడ ప్రమాదవశాత్తు కూలిపడటంతో దాని నిండా ఆమ్లనీరు చేరింది. తొవ్వి వదిలేసిన గని నుండి గోతిలోకి ప్రవహించింది. 100 మీటర్ల లోతున్న గోతిలో 30మంది మైనర్లు పడిపోయారని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న నీరు వొదిలేసిన గోతిలోకి చేరిందన్నారు.అయితే, ప్రమాద సంఘటనుండి 15మంది మైనర్లు తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. వారిని సజీవంగా బయటకు తీసేందుకు అవిశ్రాంతంగా కృషిచేస్తున్నామని అందువల్ల సహాయకచర్యలు కొంచెం మందకొడిగా సాగుతున్నాయని వారు చెప్పారు.గనిలోనున్న మురికినీటిని తోడేందుకు 10 పైపులను వినియోగించి వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని జిల్లా అధికారయంత్రాంగం తెలిపింది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
