చెప్పులు

Sun, 6 Dec 2009, IST    vv

లఉదయం - సాయంత్రం

చలికాలం- వేసవికాలం

ప్రతి కాలంలోను

సుఖంలోను- దుఃఖంలోను

జీవితపు పరుగు పందెంలో

ఉంటాయి నాకవి తోడు.

అడుగడుగునా మౌనంగా

ఏ ఫిర్యాదు లేకుండా

ఏ ఆజ్ఞా లేకుండా

ఆరగిస్తాయవి నా క్షేమంకోసం-

నా వంతు ధూళిని, మురికిని, ముళ్ళని

విశ్రాంతి కలిగిస్తాయవి నాకు-

తమ సుతిమెత్తని దేహంపై

జీవితపు ప్రతి మలుపులోనూ

క్షణక్షణం చేస్తాయవి నాకు హితం-

నమ్మకస్తుడైన స్నేహితునిలా.

మరి నేనేమో

వాటి అందం అడుగంటిందనిపించగానే

వాటి ఉపయోగం తగ్గటం ప్రారంభంకాగానే

తీసిపారేస్తాను వాటిని చాలా తేలిగ్గా

విసిరిపారేస్తాను వాటిని బయటకు

ఒక్క విసురు విసిరి-

ఆ పాత చెప్పుల్ని

నా జీవితంనుంచి...

హిందీ మూలం : కంచన్‌ ఖన్నా

అనువాదం : డా|| వెన్నా వల్లభరావు


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు