మనదేశంలో
ఎప్పుడైనా ఎవరైనా గొప్పవ్యక్తి
ఏ మహానాయకుడో మరణించినప్పుడు
ప్రకటిస్తుంది ప్రభుత్వం-
జాతీయ శోకం.
జరుపుకుంటాం మనం-
జాతీయ శోకం.
ఆఫీసులకు శెలవిస్తారు
ఆరోజు పెద్దాఫీసర్లేమో
వీసీయార్లో చూస్తారు సినిమాలు
ఉద్యోగస్తులేమో సినిమాహాళ్ళలో
స్కూళ్ళకు శెలవివ్వటంతో
ఆనందిస్తారు పిల్లలు అమితంగా
అవనతం చేస్తారు జాతీయ జెండా
ప్రసారం చేస్తుంది ఆకాశవాణి-
శాస్త్రీయ సంగీతం నిరంతరాయంగా.
దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేస్తారు-
సితార్ నాదం పొద్దస్తమానం.
శోకదినాల్లో
అటు ఆకాశవాణి వినేవారూ ఉండరు
ఇటు దూరదర్శన్ చూసేవాళ్ళూ ఉండరు
అందరూ ఆనందంగా పాటిస్తారు-
జాతీయ శోకం...
- హిందీమూలం : దేవేద్రకుమార్ మిశ్రా
- అనువాదం : డా||వెన్నా వల్లభరావు
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
