నేడు రియాజ్‌ ఇంటరాగేషన్‌ !

Tue, 14 Sep 2010, IST    vv

కరాచి : 'స్పాట్‌ ఫిక్సింగ్‌ ' స్కాంలో నాలుగో నిందితునిగా వున్న పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ను స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు బుధవారం విచారించనున్నారు. వాస్తవానికి మంగళవారం ఈ విచారణ జరగాల్సి వున్నా రేపటికి వాయిదా పడిందని పాక్‌ జట్టు మేనేజర్‌ యవార్‌ సయీద్‌ పేర్కొన్నారు. కాగా, వత్తిడుల కారణంగానే రియాజ్‌ విచారణకు తాము అంగీకరించామని వెలువడుతున్న వార్తలను పిసిబి ఖండిస్తూ, ఈ ఆరోపణలపై పరిశోధనకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే రియాజ్‌ను వన్డే జట్టులో కొనసాగించరాదని కూడా ఎలాంటి వత్తిడులు రాలేదని పిసిబి లీగల్‌ అడ్వయిజర్‌ తఫాజుల్‌ రిజ్వి వ్యాఖ్యానించారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు