అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కొత్త అధినేత ఎన్నికకు ముందు చాలా గందరగోళం జరిగింది. ఈ పదవిపై సాంప్రదాయక ఐరోపా పట్టును తొలగించేందుకు ప్రవర్థిత దేశాలు పిలుపునిచ్చాయి. అయినా ఫ్రాన్స్‌కు చెందిన సమర్థురాలైన ఆర్థికమంత్రి క్రిస్టినా లాగార్డేను 2011 జులై 5 నుండి ఐదేళ్ళపాటు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించేందుకు ఐఎంఎఫ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఐఎంఎఫ్ లో అత్యధిక ఓటింగ్ అధికారం కలిగి వున్న అమెరికా, ఆమెకు చెప్పుకో దగిన ప్రత్యర్థి అయిన మెక్సికన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అగస్టీన్ కార్సెటెన్స్‌ను కాదని ఆమెకు తన మద్దతుప్రకటించడంతో ఆమెకు మార్గం సుగమం అయింది
జాతీయతతో సంబంధం లేకుండా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్నిక ప్రతిభ ఆధారంగానే జరగాలన్నది బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) ప్రకటిత వైఖరి. లాగార్డే, కార్స్‌టెన్స్ లిరువురూ ప్రధాన ప్రవర్థిత దేశాల మద్దతు కోసం తమ లాబీయింగ్ చేశారు. అయితే బ్రిక్స్ ఉమ్మడిగా ఏ అభ్యర్థినీ నిలబెట్టలేదు. లాగార్డేకు ప్రవర్థిత ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్, చైనాలతో సహా ద్రవ్యనిధికి చెందిన 187 సభ్య దేశాల విస్తృత మద్దతు ఉన్నదని తెలుసుకున్న అమెరికా కూడా ఆమెకు అనుకూలంగా కదిలింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడున్న సమయం లో ఈ అనివార్యమైన సంస్థ(ఐఎంఎఫ్)కు నాయ కత్వం అందించేందుకు లాగార్డేకున్న అసాధారణ మైన ప్రజ్ఞావిశేషాలు, అపారమైన అనుభవం ఎంతగానో తోడ్పడుతుందని అమెరికా ఆర్థికమంత్రి టిమోతి గీత్‌నర్ అన్నారు. ప్రవర్థిత ఆర్థిక వ్యవస్థల తో సహా ద్రవ్యనిధి సభ్య దేశాల విస్తృత మద్దతును ఆమె పొందగలగడం మాకు ప్రోత్సాహాన్ని స్తోందని అన్నారు. ఇటీవలనే వాషింగ్టన్ సందర్శించిన ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ''ఆమె నాయకత్వంలో ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థికవ్యవస్థకు ఎదురౌతున్న తీవ్రమైన సవాళ్ళను కట్టుదిట్టంగా, సబబైన రీతిలో ఎదుర్కోగలరని, పాలనాపరమైన సంస్కరణల క్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నూతన బాధ్యతలో ఆమెతో కలిసి పనిచేసేందుకు భారత్ ఎదురుచూస్తోంద''ని ఆయన వ్యాఖ్యానించారు.
తన వరకు లాగార్డే కొనసాగుతున్న సంస్కరణల క్రమంలో ఐఎంఎఫ్‌లో ప్రవర్థిత దేశాల పాత్రను పెంచేందుకు కృషి చేయగలనని వాగ్దానం చేశారు. లాగార్డే(55), 1944లో స్థాపించబడిన ఐఎంఎఫ్‌కు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ. ఈమె తన దేశానికి చెందిన డొమినిక్‌స్ట్రాస్-కన్ రాజీనామా చేయడంతో ఆపదవికి ఎన్నుకోబడ్డారు. ఆయన ప్రపంచ సంక్షోభం నుండి ఐఎంఎఫ్‌ను జాగ్రత్తగా బయటపడవేయగలిగారు. ప్రవర్థిత, తదితర వర్థమాన దేశాలకు ప్రాతినిథ్యం, మరింత గొంతును కల్పించేందుకు సంస్కరణలను రూపొందించ గలిగారు. ఆ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమ ప్రస్తుత పలుకుబడిని ప్రతిబింబించేరీతిలో వ్యవహరించే హోదాను కల్పించేందుకు కృషి చేశారు. ఈ సంస్కరణలు ఐఎంఎఫ్/ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాలు ఈ సెప్టెంబరులో జరిగిన తరువాత అమలులోకి రానున్నాయి.
ఎన్నికానంతరం లాగార్డే మాట్లాడుతూ ''తన యావన్మంది సభ్యత్వానికి అదే కేంద్రీకరణతో, అదే ఉత్సాహంతో మన సంస్థ తన సేవలను కొనసాగించ డమే తన ముందున్న ప్రప్రధమ లక్ష్యమ''ని అన్నారు. అది సందర్భశుద్ధితో స్పందనా త్మకంగా ప్రభావవంతంగా, చట్టబద్దతతో, నిలకడైన వృద్ధితో, స్థూల ఆర్థిక సుస్థిరతతో అందరికీ మెరుగైన భవిష్యత్‌తో ఉండాల''ని ఆమె ఆకాంక్షించారు. ప్రధాన యూరోపియన్ దేశాలు-ద్రవ్యనిధి అధినేతగా ఒక యూరోపియన్ ఉండాలని గట్టిగా కోరుకున్నమాట రహస్యమేమీకాక పోయినా తను యూరప్‌నే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాననే భయాందోళనలను ఆమె కొట్టిపారేశారు.
నేనిక్కడ ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ లేను. మొత్తం సభ్యత్వానికి ప్రతినిధిని. అలాగే ఒడంబడికలోని ద్రవ్యనిధి లక్ష్యాల కనుగుణంగా పనిచేస్తానని ఒక అభ్యర్థిగా ఎగ్జిక్యూటివ్ బోర్డులో అంతకుముందు ఆమె వెల్లడిం చారు. అయితే లాగార్డే తక్షణం దృష్టిపెట్టాల్సిన అంశం అప్పుల ఊబిలో కూరుకు పోయిన గ్రీస్ ఆర్థిక వ్యవస్థకు విముక్తి కలిగించడం. దానికి ఐఎంఎఫ్ మద్దతు గల యూరోపియన్ యూనియన్ కృషి కూడా వుండాలి. మిత వ్యయ చర్యలను వెనువెంటనే అమలు చేసే దిశగా గ్రీస్ ప్రభుత్వం కదలాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
''జాతీయ ఐక్యతను దృష్టిలో వుంచుకొని- అధికారంలో వున్న పార్టీకి మద్దతునివ్వవలసిందిగా రాజకీయ విపక్షానికి ఆమె పిలుపునిచ్చారు. ఏథెన్స్‌లో ప్రజా నిరసనలు వెల్లువెత్తుతున్నా, తాజా మద్దతు పొందేందుకు వీలుగా గ్రీస్ ప్రజలు ప్యాకేజీకి ఓటు వేశారు.
ఐఎంఎఫ్ ప్రమేయంతో సహా మొత్తం 110 బిలియన్ యూరోల బెయిల్‌ఔట్‌ను గ్రీస్‌కు అందజేసేందుకు జరిగిన చర్చలలో ఫ్రాన్స్ ఆర్థికమంత్రిగా లాగార్డే ఒక ప్రముఖ మైన పాత్రను పోషించింది. అయితే బడ్జెట్‌లోటు 10 శాతం ఉంటున్న పరిస్థితుల్లో దాని రుణాన్ని (జిడిపిలో 142 శాతం) ఏ విధమైన భారీ పునర్‌వ్యవస్థీకరణకు మాత్రం లాగార్డే వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. యూరప్‌లోని మిగిలిన ప్రాంతం నుండి ఐఎంఎఫ్ నుండి గ్రీస్ రెండవ బెయిల్‌ఔట్ కోసం దరఖాస్తు చేసుకొంది. బహుశా 2010 స్థాయిలోనే అయి వుంటుంది. నిర్ణయాత్మకమైన చర్య తీసుకోని పక్షంలో యూరప్‌లోని కీలక ప్రాంతాలకు
ఉద్రిక్తతలు విస్తరిస్తాయని అలాగే దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.
ముంచుకొస్తున్న రాజ్యాల రుణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఐఎంఎఫ్‌ను ముందుకుతేవడం జరిగింది. మొదటి క్రిందటేడాదిలో గ్రీస్‌లో ఆ తరువాత అదే పద్ధ్దతిలో ఆర్థిక ఒత్తిళ్ళనెదుర్కొంటున్న ఐర్లాండ్, పోర్చుగల్‌లకు సహాయం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా అది 2011 జూన్ వరకు 110 బిలియన్ డాలర్ల రుణాలందజేయడాన్ని పూర్తిచేసింది. లాగార్డే, ఆమెకున్న రాజకీయ అనుభవం, చతురతలు ప్రపంచం కంటే యూరప్ సమస్యల పరిష్కర్తగా గుర్తింపు పొందకుండా జాగ్రత్త పడేలా చేస్తాయి. ఆర్థిక సంక్షోభం నుండి ప్రపంచ దేశాలలోఅసమానంగా కోలుకునే పరిస్థితి, ప్రపంచ అసమతౌల్యాలు తిరిగి బహిర్గతం కావడం, అస్థిరీకరించే శక్తి సామర్ధ్యాలు గల పెట్టుబడుల ప్రవేశం, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇబ్బందులెదుర్కొంటున్న దేశాల పరిస్థితులు అన్నీ ద్రవ్యనిధి ఎదుట పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్న విషయం ఆమెకు బాగా తెలుసు.
ఎగ్జిక్యూటివ్ బోర్డుకు అధ్యక్షత వహించే సమయానికి అనేక విధానపరమైన సమస్యలు ఆమెముందున్నాయి. అవి ప్రపంచ ఆర్థిక స్వస్థతకు తీసుకోవలసిన విధానపరమైన చర్యలు, యూరప్ ప్రాంత సంక్షోభాలను నెమ్మదింపజేయడం. అలాగే ఐఎంఎఫ్ చట్టబద్ధత, ప్రభావాన్ని మెరుగుపరచడం వంటివి. ద్రవ్యనిధి స్థాయిలో సమానావకాశాలు కల్పించడంలో లాగార్డే ఉత్సుకత చూపుతున్నారు.
స్త్రీ, పురుషులకు సంబంధ విద్య, భౌగోళిక తారతమ్యాలను ప్రస్తావిస్తూ-ఈ రంగాలలో పురోగతి సాధించాల్సింది వుందని అంటున్నారు. ముగ్గురు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా అమెరికా తన అభ్యర్థి పేరు ప్రకటించింది. అది సాధారణంగా అమెరికన్ల, చేతుల్లోనే వుంటోంది. అలాగే చైనా కూడా ద్రవ్యనిధిలో వున్న తన సీనియర్ సభ్యుడికి ప్రమోషన్ లభిస్తుందని ఆశిస్తోంది.
ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధికి ఎల్లప్పుడూ యూరోపియన్లే నేతృత్వం వహించే ''పాత విధానాన్ని''మార్చే అవకాశాన్ని ప్రవర్థిత దేశాలు జారవిడుచుకున్నాయని వాషింగ్టన్‌లోని మేథో సంస్థల ఆర్థికవేత్తలంటున్నారు. పీటర్సన్ సంస్థలో పనిచేసే సీనియర్ ఫెలో అరవింద్ సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ చైనా, బ్రెజిల్, భారత్‌లు, మరికొందరు తమ పలుకుబడిని కార్‌స్టెన్స్ వెనుక మొహరించి ఉన్నట్లైతే అమెరికాకు లాగార్డేను సమర్థించేందుకు ఇబ్బందికరమైన పరిస్థితినెదుర్కోవలసి వచ్చి
ఉండేది. అయినాగాని, ప్రవర్థిత దేశాలు ఈ అవకాశాన్ని కోల్పోయినా లాగార్డే విజయం అమె వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యాలను బట్టి వారికి మంచి ఫలితాన్నిచ్చేదిగా ఉండబోతోందని (బూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో పనిచేసే ఈశ్వరప్రసాద్ అంటున్నారు.
లాగార్డే తక్షణ ప్రాధాన్యత-గ్రీస్ రుణ సంక్షోభంలో ఐఎంఎఫ్ ప్రమేయాన్ని లాగార్డే వారిని దూరం చేసుకోకుండా అలాగే మరీ అధిక ప్రాధాన్యతనివ్వకుండా ఉండేవిధంగా తిరిగి రూపొం దించుకోవాల్సి ఉందని ప్రసాద్ చెప్పుకొస్తున్నారు.
యూరప్ రుణ సంక్షోభంలో గతంలో కీలకపాత్ర పోషించిన తరువాత ఇప్పుడామె తన బరువు బాధ్యతలను దించుకోగలుగుతుందా, తాజాగా మరింత వాస్తవిక దృష్టితో వ్యవహ రిస్తుందా? అన్నది వేచిచూడాల్సిన ప్రశ్న. అయితే దీర్ఘకాలిక సవాలేమిటంటే ఐఎంఎఫ్‌్‌లో ప్రవర్థిత మార్కెట్ల విశ్వాసాన్ని పునర్నిర్మించడం, దానికి ముందుగా ఎగ్జిక్యూటివ్ బోర్డులో ప్రాతి నిధ్యాన్ని, ఓటింగ్ వాటాలలో ఆమోదిత మార్పులను త్వరగా అమలు జరిగేటట్లు చూడడం. రెండవది, వాస్తవిక తల కనుగుణ్యంగా సంస్థలోకి ప్రాతినిధ్యాన్ని తీసుకువచ్చేందుకు మరింత చురుకుగా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లగలగాలి.
ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి పొంచివున్న ప్రమాదాన్ని పరిష్కరించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురౌతున్న బలమైన పర్యవ సానాలను అదుపు చేసేందుకు, అలాగే ద్రవ్యనిధి బహుముఖ నిఘాను బలోపేతం చేయడం వంటి సమస్యలు ఆమె పరిష్కారానికి ఎదురు చూస్తున్న అంశాలు. చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, బ్రిటన్, అమెరికా వంటి ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు- ఒక బలమైన, స్థిరమైన, సమతౌల్యంతో కూడిన వృద్ధిని సాధించడంతో జి-20 ఆదేశిత పరస్పర అంచనా క్రమాన్ని ఐఎంఎఫ్ ఇప్పుడే పూర్తి చేసింది.
ఫ్రాన్స్ నాయకత్వంలో కేన్స్‌లో జరిగే వచ్చే జి-20 సమ్మిట్‌లో (అగ్రనాయకుల సమావేశం) ఐఎంఎఫ్ కూడా, ప్రపంచ అసమతౌల్యాలను తగ్గిం చేందుకు, సూచనాత్మక మార్గ దర్శకాలపై ఆధార పడి కొన్ని అనుబంధం నివేదికలను ప్రవేశపెట్ట నుంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
